ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Pawan kalyan: వచ్చే ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎన్నుకోకపోతే నష్టపోతారు

ABN, First Publish Date - 2023-08-15T15:51:01+05:30

ప్రతిసారీ పోలీసులు వచ్చి ఏదో చేస్తారని ఆశించవద్దు. మన కళ్ల ముందు అన్యాయం జరిగితే ప్రశ్నించండి. అందరూ కలిసి సంఘటితంగా పోరాటం చేయండి. మన డబ్బుతో.. మన పన్నులతో పాలన సాగిస్తూ మనల్ని శాసిస్తున్నారు. పన్నులు కట్టకపోతే మనకు నోటీసు ఇస్తారు. దురాక్రమణ చేసినా..

అమరావతి: ఎవరు తప్పు చేసినా ప్రజా కోర్టులో శిక్ష పడాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan kalyan) ఆకాంక్షించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేనానిని మాట్లాడారు. ‘‘ప్రతిసారీ పోలీసులు వచ్చి ఏదో చేస్తారని ఆశించవద్దు. మన కళ్ల ముందు అన్యాయం జరిగితే ప్రశ్నించండి. అందరూ కలిసి సంఘటితంగా పోరాటం చేయండి. మన డబ్బుతో.. మన పన్నులతో పాలన సాగిస్తూ మనల్ని శాసిస్తున్నారు. పన్నులు కట్టకపోతే మనకు నోటీసు ఇస్తారు. దురాక్రమణ చేసినా.. ప్రభుత్వ ఆస్తులను అన్యాక్రాంతం చేస్తే కఠిన చర్యలు తీసుకునేలా జనసేన చట్టాలు చేస్తుంది. డబ్బు మొత్తం కొందరి దగ్గరే పేరుకు పోతుంది. దొడ్డి దారిన రాజకీయాల్లోకి వచ్చి విచ్చల విడిగా దోపిడీ చేసే వారిని ఏం‌ చేయాలి. సరైన వ్యక్తిని చూసి ఎన్నుకోకపోతే 2047కి మీ పిల్లల భవిష్యత్తు మీరే నాశనం చేసిన వారవుతారు. తాగునీరు ఉందా?, గాలి కలుషితం అవుతుందా అనే అంశాలను అలోచించాలి. వేల కోట్లు ఉన్న సీఎం జగన్ (CM Jagan) వీటిని కొనుక్కుంటారు. సామాన్య ప్రజలు వీటిని కొనే పరిస్థితి ఉండదు. ప్రజలు ఆలోచన చేయండి.. సరైన వ్యక్తులనే ఎన్నుకోండి. స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ప్రయత్నం చేస్తున్నా. వీళ్లు ఇచ్చే పథకాలు కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాం. ప్రజలకు ఆ పథకాలు వల్ల ప్రయోజనం జరిగేలా చూస్తా. మధ్య తరగతి మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి. మహిళలకు రాజకీయంగా సముచిత స్థానం ఉండాలని కోరుకుంటున్నా.’’ అని పవన్‌కల్యాణ్ తెలిపారు.

Updated Date - 2023-08-15T15:51:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising