ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kanna: వైసీపీ చేసేది సంక్షేమం కాదు..

ABN, First Publish Date - 2023-06-29T15:34:54+05:30

పల్నాడు జిల్లా: సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలను ప్రజలకు చూపించటానికే బస్సు యాత్ర చేపట్టామని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పల్నాడు జిల్లా: సైకో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) చర్యలను ప్రజలకు చూపించటానికే బస్సు యాత్ర చేపట్టామని టీడీపీ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ (Kanna Lakshmi Narayana) అన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆయన పల్నాడులో మీడియాతో మాట్లాడుతూ ప్రజాధనాన్ని వృధా చేయటం సీఎం జగన్ మనస్తత్వమని, వైసీపీ చేసేది సంక్షేమం కాదని అన్నారు. సెల్ఫీ చాలెంజ్ మొదలు పెట్టిన వెంటనే అభివృద్ధి మొదలుపెట్టారన్నారు. లబ్ధిదారులకు వచ్చే టిడ్కో ఇల్లు రద్దు చేయటం దుర్మార్గపు చర్య అని, వైసీపీ ప్రభుత్వం (YCP Govt.) అభివృద్ధిని గాలికి వదిలేసిందని ఆరోపించారు. ప్రజల మీద పడి రాబందుల లాగా పిక్కుతింటున్నారని, ఈ సైకో ముఖ్యమంత్రి పోతే నిజమైన అభివృద్ధి జరుగుతుందని, జగన్ రాక్షస పాలన అంతం చేయాలని కన్నా లక్ష్మీ నారాయణ పిలుపిచ్చారు.

మాజీమంత్రి పత్తిపాటి పుల్లారావు (Pattipati Pullarao) మాట్లాడుతూ.. నదుల అనుసంధానం మొదలు పెట్టిందే చంద్రబాబని.. ఆంధ్రప్రదేశ్‌కు సాగునీరు, తాగునీరు వృధాగా పోకుండా నదుల అనుసంధానం చేశారన్నారు. అద్భుతమైన ప్రాజెక్టు గోదావరి -పెన్నా నదుల అనుసంధానం జరిగిందన్నారు. ప్రజావేదిక విధ్వంసంతో జగన్ పాలన మొదలైందని, ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసే అధికారం జగన్‌కు లేదన్నారు. జగన్‌ది సైకో మనస్తత్వమని, పోలవరాన్ని పడకెక్కించారని దుయ్యబట్టారు. గోదావరి -పెన్నా ప్రాజెక్టు గురించి ఇరిగేషన్ మంత్రి అంబటికి భాద్యత లేదా? అని ప్రశ్నించారు. శిలాఫలకాలు వేయటం తప్ప వైసీపీ చేసిందేమీలేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మద్యం ఎరులై పారుతుందని పుల్లారావు అన్నారు.

Updated Date - 2023-06-29T15:34:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising