ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanna Lakshminarayana: ఏపీ విద్యుత్ శాఖలో అక్రమాలపై సీబీఐ విచారణ చేపట్టాలి..

ABN, First Publish Date - 2023-04-10T13:47:26+05:30

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని (Electricity Sector) సీఎం జగన్ భ్రష్టు పట్టించారని, జగన్ ఒక్కరోజు సీఎంగా ఉన్నా రాష్ట్రానికి శాపమేనని అన్నారు. అప్పులు, ఖర్చులపై వైట్ పేపర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏపీ విద్యుత్ శాఖలో అక్రమాలపై సీబీఐ విచారణ (CBI Investigation) చేపట్టాలని కన్నా డిమాండ్ చేశారు.

సీఎం జగన్ అవినీతి దాహం వల్లే విద్యుత్ ఛార్జీల భారం పెరిగిందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. విద్యుత్ కొనుగోళ్లలో కమీషన్ల ద్వారా రూ.6 వేల కోట్లు దండుకున్నారని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు పెట్టే అంశంలో కూడా రూ.కోట్లు దోచుకున్నారని విమర్శించారు. మహారాష్ట్రలో ఒక్కో మీటర్‌కు రూ.18 వేలు ఖర్చు చేస్తుంటే.. ఏపీలో మాత్రం రూ.30 వేలు ఖర్చు పెడుతున్నారని, మంత్రి పెద్దిరెడ్డి బినామీ కంపెనీలకే స్మార్ట్ మీటర్ల కాంట్రాక్ట్ ఇచ్చారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.

Updated Date - 2023-04-10T13:47:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising