ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: కన్నా నివాసం నుంచి మంగళగిరి టీడీపీ ఆఫీస్ వరకు భారీ ర్యాలీకు ఏర్పాట్లు

ABN, First Publish Date - 2023-02-23T10:50:53+05:30

గుంటూరు జిల్లా: మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) గురువారం టీడీపీ (TDP)లో చేరనున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు జిల్లా: మాజీ మంత్రి, గుంటూరు జిల్లాకు చెందిన సీనియర్‌ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) గురువారం టీడీపీ (TDP)లో చేరనున్నారు. ఈ సందర్భంగా కన్నా నివాసం నుంచి మంగళగిరి టీడీపీ కార్యాలయం వరకు భారీ ర్యాలీకు ఏర్పాట్లు చేశారు. ఈరోజు మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu

) సమక్షంలో ఆయన పచ్చ కండువా కప్పుకోనున్నారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటు తాళ్ల వెంకటేష్ యాదవ్ (Thala Venkatesh Yadav) కూడా టీడీపీలో చేరనున్నారు. పొన్నూరు నుంచి రెండు సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

కాగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న కన్నా... ఇప్పటికే తన అనుయాయులతో సమావేశమై వారిని తనతో పాటు పార్టీలో చేర్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. బీజేపీకి చెందిన మరో సీనియర్‌ నేత, గుంటూరు జిల్లాకు చెందిన తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌, మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా సోదరుడు, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌ఎమ్‌ నిజాముద్దీన్‌ కూడా బీజేపీని వీడి కన్నాతో పాటు టీడీపీలో చేరనున్నారు. సుమారు రెండు వేల మంది అనుయాయులతో భారీ ర్యాలీగా టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివెళ్లేందుకు సన్నాహాలు చేశారు.

ఇప్పటికే గుంటూరులో కన్నా ఇంటి వద్ద నుంచి ప్రధాన సెంటర్‌ వరకు ఎన్టీఆర్‌, చంద్రబాబు, లోకేశ్‌, కన్నా ఉన్న ఫ్లెక్సీలు వెలిశాయి. నిత్యం జనం మధ్య ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేసే కన్నాకు ఏ పార్టీలో ఉన్నా జనాదరణ మెండుగా ఉంటుందని.. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కాపు సామాజికవర్గంలో ఎంతో పట్టుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే ఆయన చేరికను వారంతా స్వాగతించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, పలు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జులు కన్నా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీలో చేరడాన్ని స్వాగతించేందుకు జిల్లాకు చెందిన సీనియర్‌ టీడీపీ నేతలు కేంద్ర కార్యాలయానికి వెళ్తున్నారు.

Updated Date - 2023-02-23T10:50:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising