Kollu Ravindra: వైసీపీ బస్సు యాత్ర బుస్సు యాత్రగా మారింది
ABN, First Publish Date - 2023-10-30T16:26:28+05:30
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించిన బస్సు యాత్ర బుస్సు యాత్రగా మారిందని, సామాజిక సాధికార బస్సు యాత్రకు దళిత, బీసీ, మైనారిటీ వర్గాల స్పందన కరువై, మంత్రుల ముఖాలు వెలవెలబోతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.
అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) ప్రారంభించిన బస్సు యాత్ర (Bus Yatra) బుస్సు యాత్ర (Bussu Yatra)గా మారిందని, సామాజిక సాధికార బస్సు యాత్రకు దళిత, బీసీ, మైనారిటీ వర్గాల స్పందన కరువై, మంత్రుల ముఖాలు వెలవెలబోతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ఎద్దేవా చేశారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగున్నరేళ్లు ఆయా వర్గాలను దారుణంగా వంచించి, హింసించి, వారిని బలితీసుకున్న జగన్ రెడ్డి (Jagan Reddy).. ఇవాళ గొంతుచించుకొని ఎంత అరిచినా, ఎన్నియాత్రలు చేసినా ఫలితం శూన్యమన్నారు.
ముఖ్యమంత్రిగా ఇన్నివేల మంది బీసీ యువతకు ఎన్ని లక్షలకోట్ల రుణాలిచ్చానని జగన్ బహిరంగంగా చెప్పగలరా? అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు రూ.75 వేల కోట్లు ఎగ్గొట్టి, బడుగు బలహీన వర్గాలకు తీరని ద్రోహం చేశానని చెప్పగల ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? అన్నారు. రిజర్వేషన్లలో 10 శాతం కోత పెట్టి బీసీలకు 16,800 పదవులు దక్కకుండా చేశానని చెప్పే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా?.. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలకు సమాధికట్టిన జగన్మోహన్ రెడ్డిని ఇంకా బడుగు బలహీనవర్గాలు నమ్మాలా? అన్నారు. పార్టీలు, కులమతాలకు అతీతంగా బీసీల్లో చైతన్యం తీసుకొచ్చి, వచ్చేఎన్నికల్లో జగన్ రెడ్డికి బీసీల దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపిస్తామని కొల్లు రవీంద్ర అన్నారు.
Updated Date - 2023-10-30T16:26:28+05:30 IST