ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: చంద్రబాబు ఆరోగ్య సమాచారంపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన న్యాయవాదులు

ABN, First Publish Date - 2023-11-15T16:35:52+05:30

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ఆరోగ్య సమాచారం ( Health Information )పై న్యాయవాదులు ఏపీ హైకోర్టు ( AP High Court ) కు నివేదికను సమర్పించారు.

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) ఆరోగ్య సమాచారం ( Health Information )పై న్యాయవాదులు ఏపీ హైకోర్టు ( AP High Court ) కు నివేదికను సమర్పించారు. చంద్రబాబుకు వైద్యులు చేసిన కంటి ఆపరేషన్, హెల్త్ కండిషన్ వివరాలను హైకోర్టుకు లాయర్లు తెలిపారు. వైద్యుల సూచనల నివేదికను మెమో ద్వారా కోర్టుకు లాయర్లు ఇచ్చారు. నివేదికలో ఏం చెప్పారంటే.. ‘‘కుడి కంటికి వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించారు. చంద్రబాబు అనారోగ్యం నుంచి కోలుకునేందుకు మందులు వాడాలి. ఐదు వారాలపాటు వైద్యులు ఐ చెకప్ కోసం షెడ్యూల్ ఇచ్చారు. కంటికి ఐదు వారాల పాటు ఇన్‍ట్రా ఆక్యులర్ ప్రెజర్ చెక్ చేసుకోవాలి. ఐదు వారాల పాటు చంద్రబాబు కంట్లో చుక్కల మందులు వేసుకోవాలి. గుండె సంబంధిత సమస్యతో చంద్రబాబు బాధపడుతున్నారు. గుండె పరిణామం పెరిగింది. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాలాల్లో సమస్యలున్నాయి. చంద్రబాబుకు తగినంత విశ్రాంతి అవసరం. మధుమేహన్ని అదుపులో ఉంచి.. జాగ్రత్తలు పాటించాలి. స్కిన్ ఎలర్జీకు సంబంధించి కూడా చంద్రబాబు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాబుకు ఎలర్జీ పెరిగిందని కూడా వైద్యులు పేర్కొన్నారు. చంద్రబాబు కాన్వాయ్‌లో, 24 గంటల పాటు అంబులెన్స్‌లో ట్రెయిన్డ్ డాక్టర్ ఉండాలని వైద్యులు సూచించారు’’ అని న్యాయవాదులు నివేదికలో తెలిపారు.

Updated Date - 2023-11-15T16:56:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising