Nagarjuna: బాబు సభలు చంపడానికే అన్నట్లుంది!?
ABN, First Publish Date - 2023-01-03T12:55:35+05:30
చంద్రబాబు (Chandrababu) పర్యటనలు ప్రజలను చంపడానికే అన్నట్లు ఉంది అని మంత్రి
గుంటూరు: చంద్రబాబు (Chandrababu) పర్యటనలు ప్రజలను చంపడానికే అన్నట్లు ఉంది అని మంత్రి మేరుగు నాగార్జున (Minister Merugu Nagarjuna) విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నెల్లూరులో మరణించిన వారి కులాలతో పనేంటి? గుంటూరు కార్యక్రమం మాది కాదు ఎవరిదో అని చంద్రబాబు చెప్పడం విడ్డూరం. కార్యక్రమానికి అనుమతి తీసుకుంది గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు. కార్యక్రమానికి పెట్టిన పేరు చంద్రన్న కానుక (Candranna kanuka). పైగా పోలీసులను టీడీపీ నేతలు (TDP leaders) విమర్శిస్తున్నారు. జరిగిన ఘటనపై చంద్రబాబుపై కేసు పెట్టి అరెస్టు చేయాలి. చంద్రబాబు రాజకీయ పబ్బం గడుపుకోవటానికే పేద వర్గాలపై స్వారీ చేస్తున్నారు. నేను చెప్పే మాటల్లో అక్షరం తప్పున్నా మంత్రి పదవికే కాదు రాజకీయ సన్యాసం తీసుకుంటా.’’ అని మంత్రి సవాల్ విసిరారు.
Updated Date - 2023-01-03T12:55:36+05:30 IST