Vidadala Rajini: ప్రజల్ని మభ్యపట్టి బాబు సభలకు తరలిస్తున్నారు

ABN, First Publish Date - 2023-01-03T13:14:06+05:30

ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు(Chandrababu) సభలకు తరలిస్తున్నారని మంత్రి విడదల రజిని(Vidadala Rajini) విమర్శించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు

Vidadala Rajini: ప్రజల్ని మభ్యపట్టి బాబు సభలకు తరలిస్తున్నారు
మభ్యపట్టి బాబు సభలకు తరలిస్తున్నారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు (Chandrababu) సభలకు తరలిస్తున్నారని మంత్రి విడదల రజిని (Vidadala Rajini) విమర్శించారు. మంత్రి మీడియాతో మాట్లాడారు. ‘‘తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నాం. గాయపడిన మరికొందరికి పరిహారం రాలేదన్నారు. వారికి కూడా పరిహారం అందేలా చర్యలు చేపట్టాం. చంద్రబాబు సభలకు ప్రజలు రావటం లేదు. ప్రజలను మభ్యపెట్టి సభలకు తరలిస్తున్నారు. సభలకు జనం పెద్ద ఎత్తున వచ్చారని ప్రచారం చేసుకోవాలని భావిస్తున్నారు. పార్టీ కార్యక్రమం కాదు ఉయ్యూరు ఫౌండేషన్ (Uyyuru Foundation) కార్యక్రమం అని చంద్రబాబు ప్రకటించారు. కానీ ప్రజలు వాస్తవాలు గమనిస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు ఎవరూ చంద్రబాబుకు మద్దతుగా లేరు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఇప్పటి వరకూ 40 మందిని బలి తీసుకుంది. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని కోరుతున్నాం.’’ అని మంత్రి విడదల రజిని తెలిపారు.

Updated Date - 2023-01-03T13:53:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising