ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YCP MLA Mustafa: వ్యాపారులకు బెదిరింపులు

ABN, First Publish Date - 2023-09-02T21:42:55+05:30

నగరంలోని వాసవీ క్లాత్ మార్కెట్ సొసైటీ(Vasavi Cloth Market Society) వ్యాపారులపై వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్(YCP MLA Mohammad Mustafa Shaikh) బెదిరింపులకు దిగారు.

గుంటూరు జిల్లా: నగరంలోని వాసవీ క్లాత్ మార్కెట్ సొసైటీ(Vasavi Cloth Market Society) వ్యాపారులపై వైసీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్(YCP MLA Mohammad Mustafa Shaikh) బెదిరింపులకు దిగారు. మార్కెట్ గేటు వద్ద ఎమ్మెల్యే ముస్తఫా షాపు ఏర్పాటుపై ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే ముస్తఫా షాపు ఏర్పాటు చేయడంపై వాసవీ క్లాత్ మార్కెట్ సొసైటీ అధ్యక్షుడు అడ్డగిరి సాంబశివరావు‌కు వ్యాపారులు ఫిర్యాదు(Merchants complain) చేశారు.గత 13సం. లుగా వివాదాలు లేకుండా వస్త్ర వ్యాపారం(Textile business) చేసుకుంటున్నాం.అర్ధరాత్రి కొందరు వచ్చి గేటు పక్కనే కంటైనర్ పెట్టారు. సొసైటీ సభ్యులు అందరు వచ్చి కంటైనర్ పెట్టడాన్ని అడ్డుకున్నారు. కంటైనర్ అడ్డుగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకనే సభ్యులు అందరూ కలసి తీసివేశారు.ప్రత్యేకంగా వస్త్ర వ్యాపారానికి మాత్రమే ఈ సొసైటీని నిర్మించాం... మార్కెట్‌లో వేరే వ్యాపారానికి అనుమతి లేదు. రాజకీయ పరమైన వత్తిళ్లు వచ్చినా ఎదుర్కోవడానికి సొసైటీ సిద్ధంగా ఉంది’’ అని అడ్డగిరి సాంబశివరావు‌ తెలిపారు.

మార్కెట్‌లో ముస్తఫా షాపు ఏర్పాటు.. గుంటూరు మేయర్‌కు ఫిర్యాదు

వాసవీ క్లాత్ మార్కెట్ గేటు వద్ద ఎమ్మెల్యే ముస్తఫా షాపు ఏర్పాటు చేయడంపై నగర మేయర్ కాటి మవోహార్ నాయుడును వాసవీ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులు కలిశారు. .తమ మార్కెట్ గేటు వద్ద ఎమ్మెల్యే ముస్తఫా షాపు ఏర్పాటుపై నగర మేయర్‌కు ఫిర్యాదు చేశారు. తన సబ్బులు , నూనెల అమ్మకాలకు రాత్రికి రాత్రి కంటైనర్ పెట్టించారని చెప్పారు.మార్కెట్ గేటు వద్ద అడ్డుగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంటుందని అసోసియేషన్ సభ్యులు నగర మేయర్ కాటి మవోహార్ నాయుడుకు సమస్యను విన్నవించారు.మార్కెట్‌లోకి వినియోగదారులను రానీవ్వకుండా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు. వాసవీ క్లాత్ మార్కెట్‌కు వచ్చే వారికి ఇబ్బందికరంగా ఉందని వ్యాపారులు. అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ముస్తఫా షాపు ఏర్పాటు చేయడంతో వినియోగదారులు మార్కెట్ లోపలికి రావడానికి భయపడుతున్నారని చెప్పారు. వెంటనే తమ వ్యాపారాలకు ఇబ్బందులు లేకుండా చూడాలని మేయర్‌కు వినతిపత్రం ఇచ్చారు.

Updated Date - 2023-09-02T22:11:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising