MP Mithun Reddy : మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరగా అమలు అయ్యేలా చూడాలి
ABN, First Publish Date - 2023-09-19T18:00:39+05:30
మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి(MP Mithun Reddy) వ్యాఖ్యానించారు.
ఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుకు వైసీపీ పూర్తిగా మద్దతు ఇస్తుందని ఆ పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డి(MP Mithun Reddy) వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళల కోసం జగన్(JAGAN) పలు సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారు.మహిళలకు నామినేటెడ్ , స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా చర్యలు తీసుకున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు త్వరగా అమలు అయ్యేలా చూడాలి. మహిళా రిజర్వేషన్ బిల్లు(Women's Reservation Bill)పై లోక్ సభలో 6 గంటల పాటు చర్చ ఉంటుంది. ఈ అంశాలపై నైనా విభేదాలు రావచ్చునేమో కానీ అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లుకు పూర్తి మద్దతు తెలుపుతాయని ఎంపీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-09-19T18:00:39+05:30 IST