MP Raghurama: లోక్‌సభలో సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీ బిల్లుపై రఘురామ ఏమన్నారంటే..?
ABN, First Publish Date - 2023-12-07T20:36:55+05:30
సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీ తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు ఉపయోగపడుతుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు ( MP Raghurama Krishnaraju ) వ్యాఖ్యానించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుపై గురువారం నాడు లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఎంపీ రఘురామ మాట్లాడుతూ.. గిరిజన యూనివర్సిటీ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రఘురామ కృతజ్ఞతలు తెలిపారు
ఢిల్లీ: సమ్మక్క, సారక్క గిరిజన యూనివర్సిటీ తెలంగాణకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు ఉపయోగపడుతుందని ఎంపీ రఘురామ కృష్ణరాజు (
MP Raghurama Krishnaraju ) వ్యాఖ్యానించారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుపై గురువారం నాడు లోక్‌సభలో చర్చ జరిగింది. ఈ చర్చలో ఎంపీ రఘురామ మాట్లాడుతూ.. ‘‘గిరిజన యూనివర్సిటీ కేటాయించినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ఉన్నారని.. ఈ గిరిజన యూనివర్సిటీతో అనేక రంగాలల్లో ప్రతిభావంతులు బయటికి వస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. అలాగే పునర్విభజన చట్టం ఇచ్చిన అన్ని అంశాలను త్వరగా పూర్తి చేయాలి’’ అని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు.
Updated Date - 2023-12-07T20:36:59+05:30 IST