Raghu Rama Krishna Raju: సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి లేఖ
ABN, First Publish Date - 2023-02-28T14:09:55+05:30
ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (AP DGP)కి ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) లేఖ రాశారు. డీజీ సునీల్ కుమార్‌పై (Sunil Kumar) కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
ఢిల్లీ: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (AP DGP)కి ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Raghu Rama Krishna Raju) లేఖ రాశారు. డీజీ సునీల్ కుమార్‌పై (Sunil Kumar) కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సునీల్ కుమార్ సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఇండియా మిషన్ వేదికలపై విద్వేషపూరిత ప్రసంగాలను చేశారని ఆరోపించారు. సునీల్ కుమార్‌పై సొంత భార్య గృహహింస చట్టం కింద కేసు కూడా పెట్టారని గుర్తుచేశారు. సునీల్ కుమార్ మామ కూడా కేసు పెట్టారని లేఖలో పొందిపరిచారు. సునీల్ కుమార్ అవినీతికి పాల్పడి ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారని తెలిపారు. సునీల్ కుమార్ అక్రమాలపై విచారించేందుకు సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సునీల్ కుమార్ అవినీతికి సంబంధించి తన వద్ద తగినన్ని ఆధారాలున్నాయని వెల్లడించారు. ఢిల్లీ (Delhi) కి వస్తే తన వద్ద ఉన్న ఆధారాలను ఇస్తానని ఎంపీ రఘురామ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Shocking Video: అబ్బ.. ఎంత పెద్దదో.. అంటూ బండిని ఆపి మరీ ఖడ్గ మృగాన్ని ఫొటోలు తీశారు.. అంతే మరుక్షణంలోనే ఊహించని సీన్..!
Updated Date - 2023-02-28T14:09:55+05:30 IST