కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Nakka Anand Babu: జగన్‌రెడ్డి జైలుకు వెళ్తే.. మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యం ఇదే..?

ABN, First Publish Date - 2023-08-05T19:22:58+05:30

ఏదో ఒక కేసులో జగన్‌రెడ్డి(Jagan Reddy) జైలుకు వెళ్తే వైసీపీ పార్టీ(YCP party)ని కబ్జా చేసి సీఎం కావాలనేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy) అసలు లక్ష్యమని తెలుగుదేశం(Telugu Desham) నేత నక్కా ఆనంద్‌బాబు(Nakka Anand Babu) అన్నారు.

Nakka Anand Babu: జగన్‌రెడ్డి జైలుకు వెళ్తే.. మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యం ఇదే..?

అమరావతి: ఏదో ఒక కేసులో జగన్‌రెడ్డి(Jagan Reddy) జైలుకు వెళ్తే వైసీపీ పార్టీ(YCP party)ని కబ్జా చేసి సీఎం కావాలనేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Minister Peddireddy Ramachandra Reddy) అసలు లక్ష్యమని తెలుగుదేశం(Telugu Desham) నేత నక్కా ఆనంద్‌బాబు(Nakka Anand Babu) అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పెద్దిరెడ్డి సొంత తమ్ముడు అక్రమాలను డైవర్ట్ చేయడానికే అంగళ్లు గ్రామంలో ప్రతిపక్షనేత చంద్రబాబు(Chandrababu)పై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. చంద్రబాబు కాన్వాయ్‌పై దాడిచేసిన వైసీపీ రౌడీలను ఎందుకు అరెస్టు చేయలేదు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టు(Irrigation project)ల సందర్శన సంధర్భంగా చంద్రబాబు కాన్వాయ్‌పై ఎక్కడా దాడులు జరగలేదని నక్కా ఆనంద్‌బాబు పేర్కొన్నారు.


మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు ద్వారకానాధ్‌రెడ్డి నియోజకవర్గాల్లోనే ఎందుకు దాడులు జరిగాయి? అని నిలదీశారు.సాగునీటి ప్రాజెక్టులపై చర్చను డైవర్ట్ చేయడానికి చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి చేయించారు... ఇది పెద్దిరెడ్డి తక్షణ లక్ష్యమని చెప్పారు.పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డికి సంబంధించిన సిగ్మా కంపెనీకి మద్యం ట్రాన్స్‌ఫోర్టు కాంట్రాక్ట్ కొట్టేసి దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి, అక్రమాలతో రూ.40 వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు.మిధున్‌రెడ్డి సిగ్మా కంపెనీకి మద్యం ట్రాన్స్‌ఫోర్టు కాంట్రాక్ట్ కొట్టేసి దోపిడీ చేస్తున్నారన్నారు. కర్నూలు జిల్లాలో ఒక మద్యం డిస్టలరీ స్వాధీనం చేసుకుని దోపిడీ చేస్తున్నారని అన్నారు. ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌రెడ్డి ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్, అలిపిరి క్లైమోర్ బాంబు బ్లాస్టు కేసులో నిందితుడైన కొల్లం గంగిరెడ్డి ఇంటికి ఎందుకు వెళ్లి కలిశాడు.? అని నక్కా ఆనంద్‌బాబు ప్రశ్నించారు.

Updated Date - 2023-08-05T19:24:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising