Nara Lokesh: లోకేశ్‌కు భోజనం వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
ABN, First Publish Date - 2023-10-10T13:58:49+05:30
మరోవైపు తాడేపల్లి సీఐడీ కార్యాలయానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులు.. దీంతో స్వల్ప వాగ్వాదం
అమరావతి: ఐఆర్ఆర్ కేసులో నారా లోకేశ్‌ను (Nara Lokesh) సీఐడీ పోలీసులు (CID) విచారిస్తున్నారు. మధ్యాహ్నం గంట పాటు లోకేశ్‌కు భోజన విరామం ఇవ్వాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే లోకేశ్‌కు భోజనం వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. భోజనాన్ని తీసుకెళ్తున్న వాహనాన్ని చాలా సేపు జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపైనే పోలీసులు నిలిపివేశారు. దీంతో టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు పోలీసులు అనుమతించారు. తాడేపల్లి-పాతూరు రోడ్డులో పోలీసుల ఆంక్షలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాతూరు రోడ్డు మార్గంలోకి ఎవరూ రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు.
మరోవైపు తాడేపల్లి సీఐడీ కార్యాలయానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అరెస్ట్ చేయడానికి ప్రయత్నించిన పోలీసులు.. దీంతో స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశించారు.
Updated Date - 2023-10-10T13:58:49+05:30 IST