ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nakka Anand Babu: సంక్షేమ పథకాలకు దిక్సూచి ఎన్టీఆర్

ABN, First Publish Date - 2023-01-09T16:26:34+05:30

సంక్షేమ పథకాలకు దిక్సూచి ఎన్టీఆర్ (ntr) అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu) గుర్తుచేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలుగువారికి,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: సంక్షేమ పథకాలకు దిక్సూచి ఎన్టీఆర్ (ntr) అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు (Nakka Anand Babu) గుర్తుచేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలుగువారికి, తెలుగుజాతికి నేడు సుదినం. ఆంధ్రుల ఆరాధ్యదైవం, మనందరి అన్న స్వర్గీయ ఎన్టీఆర్ తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నేటికి 40ఏళ్లు. తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో మంటగలుస్తున్న తరుణంలో ఎన్టీఆర్ తెలుగుజాతి రక్షణ కోసం కంకణ బద్ధుడయ్యాడు. మహిళలకు ఆస్తిలో సమానవాటా, పక్కాఇళ్లు, జనతావస్త్రాల పంపిణీ, రైతులకు రూ.50కే హార్స్ పవర్ విద్యుత్ పథకాలు దేశగతినే మార్చాయి. జగన్ (Cm jagan) ఏలుబడిలో తెలుగుజాతి ప్రమాదంలో పడింది. జగన్ రెడ్డి కబంధహస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడటమే ఎన్టీఆర్‌కు తెలుగుజాతి ఇచ్చే నిజమైన నివాళి. నాడు ఎన్టీఆర్ చూపిన పోరాటపటిమనే.. నేడు జగన్ రెడ్డిని పారద్రోలడంలో ప్రజలు చూపాలి. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలనే తర్వాత ముఖ్యమంత్రులు కొనసాగించారు. సాంకేతిక పరిజ్ఞానంతో విద్య, వైద్య, పారిశ్రామిక, వ్యవసాయ రంగాల్ని కొత్తపుంతలు తొక్కించిన ఘనుడు చంద్రబాబు. నేటి యువత ఎన్టీఆర్, చంద్రబాబు (Chandrababu)ల పాలన, వారి పట్టుదల, తెగింపు, పోరాటం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.’’ అని నక్కా ఆనంద్‌బాబు కోరారు.

Updated Date - 2023-01-09T16:28:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising