Pawan Kalyan : వలంటీర్ల ద్వారా సర్పంచ్‌ల అధికారాలను లాక్కుంటారా..?
ABN, First Publish Date - 2023-08-05T19:14:58+05:30
వలంటీర్ల(volunteers) ద్వారా సర్పంచ్‌ల(Sarpanches) అధికారాలను సీఎం జగన్(CM Jagan) లాక్కుంటున్నారని జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. శనివారం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్ వ్యవస్థను తెచ్చి పంచాయతీరాజ్‌కు పోటీగా నడుపుతున్నారని వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పై ధ్వజమెత్తారు. ప్రజలకు చేరువ అయ్యే మనుషులుగా కాకుండా వలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా ఉన్నారని మండిపడ్డారు. సర్పంచ్‌లు కష్టపడి ఎన్నికల్లో విజయం సాధిస్తే వారికి హక్కులు లేకుండా చేశారని దుయ్యబట్టారు.
అమరావతి(Amaravati): వలంటీర్ల(volunteers) ద్వారా సర్పంచ్‌ల(Sarpanches) అధికారాలను సీఎం జగన్(CM Jagan) లాక్కుంటున్నారని జనసేన(Janasena) అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) అన్నారు. శనివారం పవన్ మీడియాతో మాట్లాడుతూ.. వలంటీర్ వ్యవస్థను తెచ్చి పంచాయతీరాజ్‌కు పోటీగా నడుపుతున్నారని వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పై ధ్వజమెత్తారు. ప్రజలకు చేరువ అయ్యే మనుషులుగా కాకుండా వలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా ఉన్నారని మండిపడ్డారు. సర్పంచ్‌లు కష్టపడి ఎన్నికల్లో విజయం సాధిస్తే వారికి హక్కులు లేకుండా చేశారని దుయ్యబట్టారు. న్యాయం అడిగితే... పోలీసులతో అరెస్టులు చేస్తున్నారని అన్నారు. కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.
అందరూ కలిసికట్టుగా గ్రామీణాభివృద్ధి కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతం చేసేలా జనసేన మ్యానిఫెస్టోలో పెడతామని చెప్పారు. గాంధీజీ వంటి వారికే విమర్శలు తప్పలేదు... తాను అన్నీ తట్టుకునేందుకు సిద్దమై వచ్చానని అన్నారు. కేంద్రం ఎన్ని నిధులు పంపినా అవి దుర్వినియోగం అయిపోతున్నాయన్నారు. అధికారం ఉంది కదా అని... పంచాయతీల డబ్బు దొంగతనం చేస్తున్నారని.. అటువంటి వారిని దొంగలు అనకుండా ఏమంటారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
సర్పంచ్‌లకు ఎన్నికలు పెట్టకుండా ఏకగ్రీవంగా ఎన్నిక చేసుకుంటారా అని నిలదీశారు. అధికార మదంతో అడ్డగోలుగా పని చేయకూడదన్నారు. ఏకగ్రీవాలకు జనసేన వ్యతిరేకం.. దీనిపై కేంద్రం చట్టం చేయాలని కోరారు. కొన్ని చోట్ల పోటీ చేసిన సర్పంచ్‌లను భయపెట్టి హింసించారన్నారు. ఒక చోట ఏకంగా అభ్యర్థిని చంపేశారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలల్లో పోటీ చెసే హక్కు అందరికీ ఉంటుందన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు కాలరాసే హక్కు సీఎం జగన్‌కు కూడా లేదన్నారు. సర్పంచ్‌లకు సంపూర్ణంగా చెక్ పవర్ ఉండాలన్నారు. మేధావులతో కూడా మాట్లాడి భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. సర్పంచ్‌లు వలంటీర్ వ్యవస్థపై దృష్టి పెట్టలాని సూచించారు. మీకు మూడు వేలు... వలంటీర్లకు ఐదువేలా అని ప్రశ్నించారు. సర్పంచ్‌ల హక్కులు, అధికారాలు లాక్కుంటారా అని మండిపడ్డారు. వలంటీర్ వ్యవస్థలో లోపాలపై అందరూ అధ్యయనం చేయాలన్నారు. భవిష్యత్తులో పంచాయతీరాజ్ వ్యవస్థ బలోపేతం దిశగా అడుగు వేద్దామని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
Updated Date - 2023-08-05T19:22:54+05:30 IST