ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Perni Nani: సీబీఐకి అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ టీడీపీ పుస్తకంలో ఎలా వచ్చింది

ABN, First Publish Date - 2023-02-11T23:00:05+05:30

కోడెల ఫోన్ తెలంగాణ పోలీసులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కోడెల ఫోన్‌లో చంద్రబాబు (Chandrababu) గురించి ఉందని ధ్వంసం చేశారని ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై బురద జల్లెందుకే విషపు రాతలతో టీడీపీ (TDP) పుస్తకం రిలీజ్ చేసిందని మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ మాజీ మంత్రి పేర్నినాని (PerniNani) ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకంలో ఉన్నవన్నీ తప్పుడు రాతలే,.. కనీసం పేరు వేసుకోలేదని మండిపడ్డారు. వివేకా హత్య జగన్ చేసి ఉంటే అప్పుడు మీ ప్రభుత్వం మీదేగా ఏమీ చేశారు?, అప్పుడు ఎఫ్ఐఆర్ (FIR)లో ఎందుకు జగన్, అవినాష్ పేర్లు చేర్చలేదు? అని పేర్నినాని ప్రశ్నించారు. శవ పంచనామాలో కూతురు అల్లుడు సంతకాలు ఎందుకు తీసుకోలేదు..? ఇప్పుడు పుస్తకంలో రాసిన రాతలు అప్పుడు చార్జి‌షీట్‌లో ఎందుకు రాయలేదు? అని ప్రశ్నించారు. సీబీఐ (CBI)కి అవినాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్‌మెంట్ ఈ పుస్తకంలో ఎలా వచ్చిందని, సీబీఐలో ఎవరినైనా మీరు లొంగ దీసుకున్నరా..?, తప్పుడు రాతలు కాకపోతే సీబీఐకి చెప్పింది మీకెలా తెలుసు అని పేర్నినాని అన్నారు.

ఎన్టీఆర్ మరణంపై హరికృష్ణ, లక్ష్మి పార్వతి సీబీఐ విచారణ కోరితే ఎందుకు వెయ్యలేదని, ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబు కారణమని లక్ష్మి పార్వతి ఇప్పటికీ చెబుతోందని పేర్నినాని ఆరోపించారు. ఎన్టీఆర్‌ (NTR)పై చంద్రబాబు చేసిన కుట్రలపై సీబీఐ విచారణ జరగాలని, కోడెల (KODELA) మరణంపై ఎందుకు విచారణ చెయ్యలేదని,.. కోడెల ఫోన్ తెలంగాణ పోలీసులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కోడెల ఫోన్‌లో చంద్రబాబు (Chandrababu) గురించి ఉందని ధ్వంసం చేశారని ఆరోపించారు. కోడెల మరణానికి జగన్ కారణం అంటున్న మీరు ఫోన్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

కోడెల మరణం వెనుక మీ పాపం ఉందని సీబీఐ విచారణ అడగలేదన్నారు. ఇటీవల చనిపోయిన ఎన్టీఆర్ కుమార్తె మరణంపై అనుమానాలు వచ్చాయని, విచారణ ఎందుకు అడగలేదని పేర్నినాని ప్రశ్నించారు. మాటిమాటికీ సీబీఐ అంటున్న చంద్రబాబు రాష్ట్రంలోకి రాకుండా జీఓ ఎందుకు ఇచ్చాడని, జగన్ తప్పు చెయ్యలేదని, అందుకే సీబీఐకి రాష్ట్రంలోకి అనుమతి ఇచ్చారని చెప్పారు. జగన్ ఇంట్లో ఆడవాళ్లపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, మీ ఇంట్లో ఆడవాళ్లే అడవాల్లా అని, రాజకీయాలు భారతికి ఏమీ సంబంధం.. ఆవిడ ఫోటో పుస్తకంలో వేశారని మండిపడ్డారు. అనకుండానే తన బార్యను ఏదో అన్నారని చంద్రబాబు బోరున ఏడ్చాడని, ఇంట్లో ఆడవాళ్లను బజారుకు తీసుకువచ్చి రాజకీయ లబ్ధి పొందే నీచ సంస్కృతి చంద్రబాబుది అని పేర్నినాని ధ్వజమెత్తారు.

Updated Date - 2023-02-11T23:01:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising