ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CM JAGAN: మూడు ప్రాంతాల హక్కుగా రాజధానులు

ABN, First Publish Date - 2023-08-16T02:23:38+05:30

వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని.. రాజధానుల(Capitals)ను మూడు ప్రాంతాల హక్కుగా చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM YS Jagan)తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకుతోడు మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు.

ప్రాధాన్య క్రమంలో ప్రాజెక్టులు పూర్తి

2025 జూన్‌ నాటికి పోలవరం..

స్వాతంత్య్ర వేడుకల్లో సీఎం జగన్‌

అమరావతి, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి) : వికేంద్రీకరణను విధానంగా మార్చుకుని.. రాజధానుల(Capitals)ను మూడు ప్రాంతాల హక్కుగా చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ (CM YS Jagan)తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకుతోడు మరో 13 జిల్లాలు ఏర్పాటు చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు(Polavaram project) నిర్మాణంలో గత ప్రభుత్వ తప్పిదాలు, సాంకేతిక సమస్యలను అధిగమించామని, ప్రస్తుతం పనులు వడివడిగా జరుగుతున్నాయని జగన్‌ తెలిపారు. 2025 జూన్‌ నాటికి ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తామన్నారు. సోమవారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రత్యేక వాహనంపై పరేడ్‌ను పరిశీలించారు. సాయుధ దళాలు ప్రదర్శించిన కవాతును, వివిధ ప్రభుత్వ శాఖలు ప్రదర్శించిన శకటాలను వీక్షించారు. అనంతరం రాష్ట్ర ప్రజలనుద్దేశించి జగన్‌ ప్రసంగించారు. గడచిన 76ఏళ్ల స్వతంత్ర భారతంలో మరే ప్రభుత్వమూ చేయని విధంగా వ్యవసాయం, విద్య, వైద్యం, మహిళా సాధికారత, పారిశ్రామిక రంగాలతోపాటు సామాజికవర్గాల పరంగా గొప్ప మార్పులు తీసుకొచ్చామని తెలిపారు.

‘గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని గ్రామ, వార్డు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పల్లెల్లో ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు, విలేజ్‌ క్లినిక్కుల ఏర్పాటుతో గత 50 నెలల్లోనే చేసి చూపించాం. ప్రజలు ఎక్కడెక్కడో ఉన్న కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా ప్రభుత్వ పథకాలు, సేవలను ఇంటింటికీ వెళ్లి తలుపుతట్టి అందించే వలంటీర్‌ వ్యవస్థను తీసుకువచ్చాం. అవినీతి, లంచాలకు తావులేకుండా రూ. 2.31 లక్షల కోట్లు నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేశాం. రాష్ట్ర మంత్రి మండలిలో 68 శాతం పదవులను, ఐదు ఉపముఖ్యమంత్రి పదవుల్లో నాలుగింటిని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయం చేసి నిరూపించాం. జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రాధాన్య క్రమంలో పూర్తిచేస్తున్నాం’’ అని తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రం దేశంలోనే ముందువరుసలో ఉందని జగన్‌ అన్నారు. ‘‘ఇంతకుముందు ఎన్నడూ రాని పారిశ్రామిక దిగ్గజాలు ఈ నాలుగేళ్లలోనే పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చారు. విశాఖలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో రూ. 13.42లక్షల కోట్ల ఎంవోయూలు కుదిరాయి. వాటిద్వారా 6లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఈ నాలుగేళ్లలోనే రాష్ట్రంలో కొత్తగా ప్రారంభమైన ఎంఎ్‌సఎంఈ యూనిట్లు 2,00,995. వీటిలో ఉపాధి పొందుతున్నవారు 12.61లక్షల మంది.

ఎంఎ్‌సఎంఈలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. విద్యారంగంలో సమూల మార్పులు తీసుకువస్తున్నాం. పేద విద్యార్థుల్ని గ్లోబల్‌ సిటిజన్లుగా తీర్చిదిద్దే క్రమంలో ఐబీ, ఐజీసీఎ్‌సఈ దిశగా అడుగులు వేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలు నిర్మిస్తున్నాం. 10,032 విలేజ్‌ క్లినిక్‌లు, 560 అర్బన్‌ హెల్త్‌ క్లినిక్‌లతోపాటు ఫ్యామిలీ డాక్టర్‌ భావనను అమలు చేస్తున్నాం. గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో 292 రకాల మందులు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలు కలిగిన 562 రకాల మందులను అందుబాటులోకి తీసుకువచ్చాం. మహిళలు, వివిధ సామాజికవర్గాలవారు విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ, జెండర్‌, రక్షణపరమైన సాధికారత సాధించేలా పలు పథకాలు అమలు చేస్తున్నాం. గత 50 నెలల్లో డీబీటీ ద్వారా రూ.2.31లక్షల కోట్లు అందించగా.. అందులో 76శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే చేరింది. 2,06,638 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తే.. అందులో 80 శాతం ఈ వర్గాలవారే ఉన్నారు’’ అని జగన్‌ వివరించారు.

Updated Date - 2023-08-16T04:30:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising