Anirudh Bose: చంద్రబాబు కేసుపై జస్టిస్ అనిరుద్ధ్ బోస్ కీలక వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-10-09T22:36:33+05:30
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) కేసుపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ్ బోస్(Anirudh Bose) కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) కేసుపై సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ్ బోస్(Anirudh Bose) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కేసులో 17A వర్తించేలా ఉంది. 17A వర్తించేందుకు ఈ కేసులో తగ్గ అన్ని వాస్తవాలున్నాయి.అధికార పరిధికి సంబంధించిన వాస్తవాలూ ఉన్నాయి. చంద్రబాబు కేసులో ప్రాధమికంగా చూస్తే 17A వర్తించేలా కనిపిస్తుందని అనిరుద్ధ్ బోస్ పేర్కొన్నారు. అనంతరం న్యాయవాది హరీష్ సాల్వే(Harish Salve) మాట్లాడుతూ.. అధికార హోదాలో ఉన్న వ్యక్తులు విధి నిర్వహణలో..తీసుకున్న నిర్ణయాలన్నీ అవినీతి నిరోధక చట్టంలోకే వస్తాయి. అధికారి సైకిల్ ఎత్తుకుపోతే అది వ్యక్తిగత నేరం అవుతుందే తప్ప.. అది అవినీతి చట్టం పరిధిలోకి రాదు. అధికారులు తీసుకునే నిర్ణయాలన్నీ.. అవినీతి చట్టం పరిధిలోకి వస్తాయి. నేరం జరిగిన తేదీతో సంబంధం లేకుండా.. విచారణ ప్రారంభమైన తేదీ నుంచే 17A వర్తిస్తుందని హరీష్ సాల్వే తెలిపారు.
Updated Date - 2023-10-09T22:36:55+05:30 IST