ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Palnadu Dist.: ఎమ్మెల్యే శంకరరావు సవాల్‌ను స్వీకరించిన టీడీపీ..

ABN, First Publish Date - 2023-04-03T16:10:24+05:30

పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక (Sand) రగడ రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే నంబూరి శంకరరావు ప్రతిపక్షాలకు వేసిన సవాల్‌ను టీడీపీ నేతలు స్వీకరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పల్నాడు జిల్లా: పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక (Sand) రగడ రోజు రోజుకు తీవ్రతరమవుతోంది. దీంతో స్థానిక ఎమ్మెల్యే నంబూరి శంకరరావు (Namburi Shankarao) ప్రతిపక్షాలకు వేసిన సవాల్‌ను టీడీపీ నేతలు స్వీకరించారు. ఇసుక దోపిడీ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇసుక దోపిడీ, మట్టి మాఫియాకు ఎమ్మెల్యే శంకరరావు బాధ్యత వహించాలని టీడీపీ నేత శ్రీధర్ (TDP Leader Sridhar) డిమాండ్ చేశారు. దీనిపై చర్చకు సిద్ధంగా ఉన్నామన్నారు.

ఈ సందర్బంగా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అభివృద్ధి నిరోధకంగా మారారని, ప్రజా సమస్యలను పక్కదారిపట్టించారని ఆరోపించారు. గతంకంటే బాగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని, ఇసుక, మట్టి మాఫియాకు పాల్పడలేదని ఎమ్మెల్యే చెబుతూ.. సవాల్ విసిరారన్నారు. ఆ సవాల్‌ను స్వీకరించామన్నారు. ప్రజల తరఫున పోరాటం చేసే విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదని, గతంలో ఏం జరిగిందీ.. ఇప్పుడేం జరుగుతుందీ.. వాటన్నింటిపై చర్చకు తాము సిద్ధమని శ్రీధర్ మరోసారి స్పష్టం చేశారు.

Updated Date - 2023-04-03T16:10:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising