ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

YuvaGalam: టీడీపీ హయాంలోనే ఎస్టీల అభివృద్ధి.. లంబాడీ వర్గీయుల సమావేశంలో లోకేశ్

ABN, First Publish Date - 2023-08-05T15:38:29+05:30

ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని టీడీపీ యువనేత నారా లోకేశ్ తెలిపారు.

పల్నాడు: ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ అని టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara lokesh)తెలిపారు. జిల్లాలో పాదయాత్ర చేస్తున్న లోకేశ్ ఈపూరు మండలం బొమ్మరాజుపల్లిలో లంబాడి వర్గీయులతో సమావేశమయ్యారు. లంబాడీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ.. ఎన్టీఆర్ హయాంలో ఐటీడీఏ ఏర్పాటు చేశారని.. చంద్రబాబు హయాంలో గిరిజన తండాల్లో రోడ్లు, తాగునీరు సౌకర్యాలు కల్పించారని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో కూడా ఇంటింటికి ఉచితంగా తాగునీరు అందించామన్నారు. వరికెపుడిసెల ప్రాజెక్టు వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో వరికెపుడిసెల పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతో అటు నిరుద్యోగులు, ఇటు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని యువనేత తెలిపారు.


వైసీపీ పాలనలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం ఎత్తివేయటంతో గిరిజనులు ఇబ్బంది పడుతున్నారన్నారు. నిత్యావసరాల ధరలు, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని లంబాడి మహిళలు లోకేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు. టీడీపీఅధికారంలోకి వచ్చాక మహాశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్థిక సాయం అందజేస్తామన్నారను. ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం ఇంట్లో ఒక్కరికే ఇస్తోందని.. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఆపివేయటంతో రెండున్నర లక్షల మంది విద్యార్ధులు ఇబ్బంది పడుతున్నారన్నారు. విద్యార్థులు చదువుకునే సమయంలోనే నైపుణ్యాలు నేర్పించేలా విద్యా ప్రణాళికలో మార్పులు చేపడతామన్నారు. కోర్సు పూర్తై బయటకు రాగానే ఉద్యోగం వచ్చేలా చేస్తామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు మెరుగు పరుస్తామన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గిరిజనులకు సంబంధించి 16 సంక్షేమ పథకాలు రద్దు చేశారన్నారు. గిరిజన తండాలను పంచాయతీలుగా మారుస్తామని జగన్ హామీ ఇచ్చి మాట తప్పారని లోకేశ్ మండిపడ్డారు.

Updated Date - 2023-08-05T15:38:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising