ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vadhe Sobhanadriswara Rao : స్వామినాథన్ దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు

ABN, First Publish Date - 2023-09-28T19:09:55+05:30

స్వామినాథన్ దేశంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్ఢే శోభనాద్రీశ్వరరావు(Vadhe Sobhanadriswara Rao) వ్యాఖ్యానించారు.

అమరావతి: స్వామినాథన్ దేశంలో పలు విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్ఢే శోభనాద్రీశ్వరరావు(Vadhe Sobhanadriswara Rao) వ్యాఖ్యానించారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘రైతుబాంధవుడు స్వామినాథన్ మరణంతో భారత దేశానికి పూడ్చలేని లోటు ఏర్పడింది. ఫిలిప్పీన్స్‌లో IRRI డైరక్టర్‌గా చాలా అధిక దిగుబడి వరి వంగడాలను రూపొందించి ప్రపంచంలోని పలు దేశాలల్లో ఆహార భద్రత చేకూర్చారు. రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, మహిళలు, నిరుపేదల సంక్షేమం కోసం ప్రభుత్వాలకు ఎంతో విలువైన సూచనలనందించిన మహోన్నత మానవతావాది స్వామినాథన్. మన దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభాన్ని గట్టెక్కాలన్నా, గ్రామీణ ప్రజానీకం గౌరవప్రదమైన ఆత్మగౌరవంతో బతకగలగాలన్నా స్వామినాథన్ కమిషన్ సూచనలను పఠించినప్పుడే సాధ్యపడుతుంది. ఇప్పటికైనా పాలకులు వివేకంతో ఆ సిఫార్సులను అమలు చేస్తారని ఆశిద్దాం. ఆ మహానుభావునికి ఆత్మ శాంతి చేకూర్చాలని, వారి కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ రైతాంగం పక్షాన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం’’ అని వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు.

Updated Date - 2023-09-28T19:09:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising