ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: కోడి కత్తి శ్రీనివాస్ విషయంలో జగన్ నోరు విప్పాలి

ABN, First Publish Date - 2023-08-31T16:47:09+05:30

ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డి(Varla Ramaiah)కి కోడికత్తి శ్రీనివాస్(Kodikatti Srinivas) విషయంలో జాలి, దయ కరుణ ఉంటే మాట్లాడాలని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) అన్నారు.

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మో‌హన్‌రెడ్డి(Varla Ramaiah)కి కోడికత్తి శ్రీనివాస్(Kodikatti Srinivas) విషయంలో జాలి, దయ కరుణ ఉంటే మాట్లాడాలని తెలుగుదేశం పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య(Varla Ramaiah) అన్నారు. గురువారం నాడు ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ కోర్టుకు వస్తే తప్ప శ్రీనివాస్ కు విముక్తి ఉండదా? భారతదేశంలో ఇంకా కొన్ని వర్గాలకు, ముఖ్యంగా దళిత జాతికి పూర్తిగా స్వాతంత్ర్యం వచ్చినట్లుగా లేదు. 2018 అక్టోబర్ 20వ తేదీన విశాఖపట్నం విమానాశ్రయంలో ఒక దళిత యువకుడు కోడికత్తితో జగన్ భుజంపై పొడిస్తే ఇంత పెద్ద శిక్షా? ఏం పెద్ద నేరం చేశాడని, దళిత జాతికి చెందిన శ్రీనివాస్‌ని కోడికత్తి కేసులో గత 1685 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉంచారు? అందుకే దళితులకు ఇంకా మన దేశంలో పూర్తి స్వాతంత్ర్యం రాలేదు. భుజంపై గాయమైందని పోలీసులు కేసు నమోదు చేయడానికి వస్తే .. ఆంధ్ర పోలీసులపై జగన్ నమ్మకం లేదన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని అడుగుతున్నా.. ఏచట్టం చెబుతోంది? డ్రామాలో భాగంగా జగన్ హైదరాబాద్‌లో తెలిసిన డాక్టర్ వద్ద అరసెంటీ మీటర్ గాయానికి 9 కుట్లు వేసి చికిత్స చేయించుకున్నారు.

శ్రీనివాస్ 1685 రోజుల నుంచి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉండడంపట్ల న్యాయవ్యవస్థ సమాధానం చెప్పాలి. ప్రజల్లో సింపతి కలిగించి జగన్‌ను అధికార పీఠం ఎక్కించాలనుకున్న కుట్రలో సమిదయిన వ్యక్తికి.. సీఎం ఇచ్చే బహుమతి ఇదేనా? మీ మేలు కోరిన వ్యక్తిని జైల్లో వేయించి శిక్షిస్తారా? ఇదెక్కడి న్యాయం? అందరు పౌరుల్లాగా మన దేశంలో దళితులకు సమాన హక్కులు లేవని ఈ సంఘటన నిరూపిస్తోంది. అధికార పార్టీలో ఉన్న దళిత ఎమ్మెల్యేలు, మంత్రులకు దళిత యువకుడు శ్రీనివాస్ పడుతున్న ఇబ్బందులు, కష్టాలు కనిపించవా? ఎందుకు స్పందించరు? మీ నోరు పెగలదేమి? సీఎంతోపాటు న్యాయ వ్యవస్థ దళిత బిడ్డ విషయంలో సమాధానం చెప్పకపోతే దళితులకు స్వాతంత్ర్యం రానట్టే లెక్క. శ్రీనివాస్‌కు బెయిల్ ఇచ్చి, బయటకు వస్తే జగన్ నాటకం బయట పడుతుందనే ఈకేసులో ఉన్న శ్రీనివాస్ గురించి మాట్లాడడం లేదు. ఇప్పటికైనా దళత బిడ్డ శ్రీనివాస్‌కు జరుగుతున్న అన్యాయం పట్ల సీఎం, న్యాయ వ్యవస్థ స్పందించి.. అతడికి విముక్తి కల్పించాలి’’ అని వర్ల రామయ్య విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-08-31T16:47:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising