Nara Lokesh: రైతుల మనసు గెలిచాకే అలా చేస్తా..
ABN, First Publish Date - 2023-04-08T20:24:34+05:30
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు.
అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) విమర్శలు గుప్పించారు. వ్యవసాయరంగాన్ని జగన్ సర్కార్ పట్టించుకోవట్లేదని, జగన్ ఏపీని రైతులు లేని రాజ్యంగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో ఏపీ మూడో స్థానం ఉందని, ఒక్కో రైతుపై రూ.2 లక్షల అప్పుల భారం మోపారని లోకేష్ మండిపడ్డారు. ఇప్పటికీ 60 శాతం మంది రైతులు సాగుపైనే ఆధారపడ్డారని, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నారా లోకేష్ అన్నారు. మేం అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని, రైతుల మనసు గెలిచాకే తలపాగా కడతానని నారా లోకేష్ స్పష్టం చేశారు. రైతులతో నారా లోకేశ్ ముఖాముఖిగా మాట్లాడారు.
మరోవైపు.. జగన్ పేరు ఇప్పుడు చోర్ మోహన్ అని, సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన వ్యక్తి చోర్ మోహన్ అని, జగన్ సర్కార్ రూ.10 ఇస్తూ.. రూ.100 దోచుకుంటోందని లోకేష్ ఆరోపించారు. రాష్ట్రానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది టీడీపీనే అని లోకేష్ అన్నారు.
రాష్ట్రానికి, ప్రజలకు చోర్ మోహన్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. బీసీలకు జగన్‌రెడ్డి వెన్నుపోటు పొడిచారని, బీసీలపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధిస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు భద్రత కల్పించేందుకు ప్రత్యేక చట్టం తెస్తామని, మోటార్లకు మీటర్లు పెట్టి రైతుల మెడకు ఉరితాళ్లు బిగిస్తున్నారని, రాయలసీమకు పట్టిన క్యాన్సర్ గడ్డ జగన్ అని లోకేష్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-04-08T20:25:57+05:30 IST