సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌లపై ఏసీబీ కోర్టులో వాదనలు ప్రారంభం
ABN, First Publish Date - 2023-10-27T11:51:42+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. చంద్రబాబు తరుఫు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు.
విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డ్‌ను భద్రపరచాలంటూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. చంద్రబాబు తరుఫు న్యాయవాదులు ఈ పిటిషన్ వేశారు. కాగా.. నిన్న చంద్రబాబు తరుఫు న్యాయవాదులు దాఖలు చేసిన కాల్ డేటా రికార్డ్ పిటిషన్‌పై సీఐడీ అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువర్గాల న్యాయవాదులు దాఖలు చేసిన సీఐడీ కాల్ డేటా రికార్డ్ పై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. ఏసీబీ కోర్టులో సీఐడీ కాల్ డేటా రికార్డ్‌లపై చంద్రబాబు నాయుడు తరుపున న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు.
Updated Date - 2023-10-27T11:51:42+05:30 IST