ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh: సహకరిస్తే యువగళం.. లేదంటే రణరంగమే

ABN, First Publish Date - 2023-02-09T21:52:16+05:30

రంగాపురం కూడలిలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh) మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: రంగాపురం కూడలిలో జరిగిన బహిరంగ సభలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Lokesh) మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సహకరిస్తే యువగళం.. లేదంటే రణరంగమే అంటూ లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి నుంచి ఓ పోలీస్ (POLICE) అధికారి యువగళం పాదయాత్రపై ఆరా తీస్తున్నారని లోకేష్ ఆరోపించారు. 2024లో వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అని లోకేష్ జోస్యం చెప్పారు. పాదయాత్రలో ఇచ్చిన ఏ ఒక్క హామీని జగన్ (JAGAN) అమలు చేయలేదని, గంగాధర నెల్లూరులో అవినీతి ఫుల్.. అభివృద్ధి నిల్ అని లోకేష్ మండిపడ్డారు.

గురువారం రోజు చిత్తూరు జిల్లా రంగాపురంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సాగింది. లోకేష్ పాదయాత్ర (Lokesh Padayatra)లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. రమేష్ మృతికి లోకేష్ సంతాపం తెలిపారు. తన పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని పోలీసులను వైసీపీ పెద్దలు టార్చర్ చేస్తున్నారని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యువగళం భద్రతకు 20 మందిని పెట్టి.. అడ్డుకోవడానికి వెయ్యి మంది పోలీసులను పెట్టడమే దీనికి నిదర్శనమని లోకేష్ విమర్శించారు. తన పాదయాత్రను అడ్డుకునే కుట్రలకు పోలీసులను బలి పెట్టొద్దని వైసీపీ (YCP) పెద్దలను కోరుతున్నానని లోకేష్ స్పష్టం చేశారు.

ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న లోకేష్ మైక్‌ను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేతలు మండిపడ్డారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కొందరు పోలీసుల వల్ల మొత్తం పోలీసు శాఖకే చెడ్డ పేరు వస్తోందని లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పాదయాత్రను పోలీసులు అడ్డుకోవడంపై మండిపడ్డారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం ఆత్మకూరు నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 14 రోజు ప్రారంభమైంది. లోకేష్ పాదయాత్రకు ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ లోకేష్ పాదయాత్రను ముందుకు సాగించారు.

Updated Date - 2023-02-09T21:58:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising