ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Jagan : నేను లండన్‌లోఉన్నప్పుడే చంద్రబాబు అరెస్ట్.. రాష్ట్ర బీజేపీ నేతల్లో సగం టీడీపీ వాళ్లే..

ABN, First Publish Date - 2023-10-09T13:23:18+05:30

టీడీపీ అధినేత చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదని.. అసలు తనకు ఆయనపై ఎలాంటి కక్షా లేదని ఏపీ సీఎం జగన్ తెలిపారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారన్నారు.

విజయవాడ : టీడీపీ అధినేత చంద్రబాబును కక్ష సాధింపుతో అరెస్టు చేయలేదని.. అసలు తనకు ఆయనపై ఎలాంటి కక్షా లేదని ఏపీ సీఎం జగన్ తెలిపారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తాను లండన్ లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారన్నారు. కేంద్రంలో బీజేపీ ఉందని.. దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని అంటున్నాడన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో సహా సగం రాష్ట్ర బీజేపీ నేతలు టీడీపీ వాళ్ళేనన్నారు. ఇవన్నీ బీజేపీతో కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు చేసిన అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారన్నారు. చంద్రబాబు అవినీతిని పసిగట్టి సీబీఐ, ఈడీ, జీఎస్టీ రంగంలోకి వచ్చాయని జగన్ అన్నారు.

అందుకే చంద్రబాబు రాష్ట్రంలో సీబీఐని అడుగు పెట్టనివ్వను అని తీర్మానం చేశాడన్నారు. గజదొంగల ముఠా వీరప్పన్ అయిన బాబును సమర్ధించడం అంటే పేదవాడిని వ్యతిరేకించటమేనన్నారు. బాబును సమర్ధించడం అంటే నయా జమీందారి వ్యవస్థను సమర్థించటమేనన్నారు. ఈ క్రమంలోనే పొత్తులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సీఎం పంచులు పేల్చారు. రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసినా వచ్చేది సున్నానేనన్నారు. ఒకడు పార్టీ పెట్టి 15 ఏళ్ళు అయ్యిందని.. అయినా ఇప్పటికీ నియోజకవర్గంలో నాయకులు లేరని జగన్ ఎద్దేవా చేశారు. గ్రామాల్లో జెండా మోసే కార్యకర్త లేడన్నారు. జీవితం అంతా చంద్రబాబును భుజాలపై మోయటానికే సరిపోతుందన్నారు.

చంద్రబాబు మోసాల్లో, అవినీతిలో పార్ట్‌నర్ దత్తపుత్రుడు అని జగన్ పేర్కొన్నారు. బిస్కెట్లు, చాక్లెట్లు పంచినట్లు దత్తపుత్రుడికి, తమ అనుచరులకు పంచుతున్నారన్నారు. రాజకీయం అంటే దోచుకోవడం, పంచుకోవటం, తినుకోవటం కాదన్నారు. చనిపొయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో ఫోటో ఉండాలనుకోవడం తన రాజకీయమన్నారు. పేదవాడి చిరునవ్వులో మనం గుర్తుకు రావాలి అనుకోవడం తన రాజకీయమన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్నా, బయట ఉన్నా తేడా లేదన్నారు. చంద్రబాబు అనగానే గుర్తుకు వచ్చేవి వెన్నుపోటు, మోసాలు, అబద్ధాలు, వంచనలు అని జగన్ అన్నారు.

Updated Date - 2023-10-09T13:23:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising