YS Jagan: పార్లమెంట్ సాక్షిగా వైఎస్ జగన్ నిర్లక్ష్యాన్నిబట్టబయలు చేసిన కేంద్రం.. కోట్ల రూపాయల కథేంటి..!?
ABN , First Publish Date - 2023-02-02T19:34:11+05:30 IST
అమరావతి (Amaravati)పై సీఎం జగన్‌రెడ్డి (Jagan Reddy) నిర్లక్ష్యాన్ని కేంద్రం బట్టబయలు చేసింది. అమరావతికి జగన్ సర్కార్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేని తెలిపింది.
ఢిల్లీ: అమరావతి (Amaravati)పై సీఎం జగన్‌రెడ్డి (Jagan Reddy) నిర్లక్ష్యాన్ని కేంద్రం బట్టబయలు చేసింది. అమరావతికి జగన్ సర్కార్ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేని తెలిపింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్ (Smart City Project)గా అమరావతిని అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తప్పుబట్టింది కేంద్రం. ఏపీ స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేసేందుకు ‘21 పనుల ప్రాజెక్టు’ల కింద.. రూ. 2046 కోట్లు కేంద్రం కేటాయించినా.. ఇప్పటివరకు ఒక్క పనిని కూడా చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. స్మార్ట్‌సిటీల పురోగతిపై లోక్‌సభలో ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghuramakrishna Raju) అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి కౌశల్ కిషోర్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. స్మార్ట్ సిటీస్ మిషన్ కింద దేశంలో ఎంపిక చేసిన వంద నగరాల్లో.. ఏపీ నుంచి అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం (Tirupati Visakhapatnam) ఎంపిక స్మార్ట్‌సిటీగా అమరావతిని అభివృద్ధిని చేసేందుకు.. రూ.2,046 కోట్లు కేంద్రం కేటాయించింది. అయితే కాకినాడ (Kakinada), తిరుపతి, విశాఖ పట్టణాల్లో కొన్ని పనులు జరుగుతున్నాయి. కానీ అమరావతిలో మాత్రం ఒక్క పని కూడా జరుగలేదు. అమరావతిలో 21 ప్రాజెక్టులు అలాట్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం రూ. 787 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో ఒక్క రూపాయి కూడా కేంద్రం ఖర్చు చేయలేదు. కేంద్రమే ఏపీ సర్కార్ నిర్ణక్ష్యాన్ని బట్టబయలు చేయడంతో... ‘ఆ కోట్ల రూపాయలు ఏం చేశారు జగన్’ అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.
అమరావతికి కేంద్రం మొండిచేయి
బుధవారం లోక్‌సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మాలాసీతారామన్ (Nirmala Sitharaman) బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగే ఈసారి కూడా అమరావతికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మొండిచేయి చూపారు. విభజన హామీలపై కేంద్ర బడ్జెట్‌లో ఎలాంటి ప్రస్తావన లేకపోవడం రాజధాని ప్రాంత వాసులను తీవ్ర నిరాశకు గురిచేశారు. ఈ బడ్జెట్‌లో అటు అమరావతిపైన, ఇటు దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్ అయిన విజయవాడ (Vijayawada) రైల్వే డివిజన్‌పైన పూర్తిస్థాయి నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. డివిజన్ పరిధిలో ప్రతిపాదిత ప్రాజెక్టులకు తాజా బడ్జెట్‌లో కంటితుడుపు నిధులు మాత్రమే విదిల్చారు. రాజధానివాసుల చిరకాలవాంఛ అయిన అమరావతి రైల్వేట్రాక్ దాదాపు అటకెక్కినట్టేనని స్పష్టం చేశారు. విజయవాడ, గుంటూరు మధ్య అమరావతిని అనుసంధానించేలా 106 కిలోమీటర్ల మేర నూతన రైల్వేలైన్ నిర్మాణానికి రూ.3,272 కోట్లతో ప్రతిపాదనలకు రైల్వేబోర్డు ఆమోదం తెలిపినా, 2019 నుంచి దాని ఊసే లేకుండా చేశారు. విభజన చట్టం మేరకు హామీ ఇచ్చిన విజయవాడ మెట్రో రైలు కథ కంచికి చేరినట్టే. రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేస్తూ మూడు రాజధానుల పల్లవి అందుకోవడంతో అమరావతి రైలు, మెట్రో రైలు ప్రాజెక్టులను కేంద్రం అటకెక్కించినట్లు స్పష్టమవుతోంది. మచిలీపట్నం (Machilipatnam)లో మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కళాశాలను మంజూరు చేయడం కాస్త కంటితుడుపు చర్యగా ఉంది.