CM Jagan : ‘ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్’ రాయడానికి జగన్ అంత ఆలోచించారేంటి?
ABN, First Publish Date - 2023-06-12T13:03:33+05:30
పాఠశాలల ప్రారంభం రోజునే విద్యాకానుక అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ సగర్వంగా వెల్లడించారు. నేడు నాలుగో విడత ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా క్రోసూరులో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో పాటు వారి బెంచ్‌పైనే కూర్చొని కాసేపు సరదాగా సంభాషించారు. పిల్లలందరికీ విద్యాకానుక కిట్లు అందజేశారు. పిల్లలతో సెల్ఫీలు దిగి వారిని ఆనందంలో ముంచెత్తారు.
అమరావతి : పాఠశాలల ప్రారంభం రోజునే విద్యాకానుక (Vidyakanuka) అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) సగర్వంగా వెల్లడించారు. నేడు నాలుగో విడత ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా క్రోసూరులో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పిల్లలతో పాటు వారి బెంచ్‌పైనే కూర్చొని కాసేపు సరదాగా సంభాషించారు. పిల్లలందరికీ విద్యాకానుక కిట్లు అందజేశారు. పిల్లలతో సెల్ఫీలు దిగి వారిని ఆనందంలో ముంచెత్తారు. ఇక వెళ్తూ వెళ్తూ.. బోర్డుపై ‘ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్’ అని రాశారు. ఇక ఇది రాయడానికి ముందు ఎందుకోగానీ ఒక్క క్షణం జగన్ ఆలోచించారు. ఆ తరువాత చాలా జాగ్రత్తగా ఆల్ ది బెస్ట్ వరకూ రాశారు. ఆ తరువాత స్టూడెంట్స్ దగ్గరకు వచ్చేసరికి కాస్త ఇబ్బంది పడ్డారు. చివరకు ఏదో రాసేశారు. ఆ తరువాత అక్కడ ఉన్న ఉపాధ్యాయుల వైపు చూశారు. ఇదంతా చాలా ఆసక్తికరంగా సాగింది. ‘ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్’ రాయడానికి జగన్ ఎందుకంత ఇబ్బంది పడ్డారనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.
Updated Date - 2023-06-12T13:03:33+05:30 IST