ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

12న నెల్లూరు జిల్లాకు జగన్.. వారం రోజుల ముందు నుంచే షాపులు బంద్‌

ABN, First Publish Date - 2023-05-07T17:25:58+05:30

సీఎం జగన్‌ (CM Jagan) పర్యటనల సందర్భంగా అధికారులు విధించే ఆంక్షలకు ప్రజలు హడలిపోతున్నారు. ప్రతిపక్షనేతగా పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టి చేరువయ్యారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: సీఎం జగన్‌ (CM Jagan) పర్యటనల సందర్భంగా అధికారులు విధించే ఆంక్షలకు ప్రజలు హడలిపోతున్నారు. ప్రతిపక్షనేతగా పాదయాత్రలో ప్రజలకు ముద్దులు పెట్టి చేరువయ్యారు. ఇప్పుడు అదే జనంలోకి వెళ్లాలంటే అనేక ఆంక్షలు పెడుతున్నారు. భద్రతా చర్యలు, ట్రాఫిక్‌ ఆంక్షలతో సామాన్యులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నారు. సీఎం జగన్‌ పర్యటనలకు వస్తే ప్రజలకు మూడినట్టే... ప్రధాని నరేంద్రమోదీ (Prime Minister Narendra Modi)కి ఎస్పీజీ భద్రత ఉంది. మాజీ ఉప ప్రధాని ఎల్‌కే ఆడ్వాణీ, హోం మంత్రి అమిత్‌ షా, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు (Chandrababu) తదితర ప్రముఖులు జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రతలో ఉన్నారు. వీరు ఉగ్రవాదులు, మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉన్నారు. ఎన్నో సందర్భాల్లో రోడ్డు మార్గంలో ప్రయాణించారు. అయినా ప్రజలు ఏనాడు ఇబ్బంది పడలేదు.

కానీ జగన్ జిల్లాలకు వస్తున్నారంటే ప్రజలు, వ్యాపారులు హడలిపోతున్నారు. ఈ నెల 12 జగన్ నెల్లూరు జిల్లా (Nellore district)లో పర్యటిస్తున్నారు. అయితే కావలిలో అధికారుల అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారుల ఆంక్షలు విధించారు. తుమ్మలపెంట రోడ్డులో వారం రోజుల ముందు నుంచే షాపులను అధికారులు బంద్‌ చేయిస్తున్నారు. షాపులు బంద్‌ చేయకపోతే తొలగిస్తామంటూ అధికారుల హుకుం జారీ చేస్తున్నారు. అధికారుల హుకుంపై వ్యాపారులు ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి ముందు గోడు వెళ్లబోసుకున్నారు. అధికారుల ఓవర్‌యాక్షన్‌పై ప్రజలు మండి పడుతున్నారు. చుక్కల భూమి శాశ్వత పరిష్కారం కార్యక్రమంలో జగన్ పాల్గొననున్నారు.

Updated Date - 2023-05-07T17:25:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising