ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Highcourt: చంద్రబాబు బెయిల్ కండిషన్‌పై సీఐడీ పిటిషన్.. తీర్పు రిజర్వ్

ABN, First Publish Date - 2023-11-01T15:36:24+05:30

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు రిజర్వ్ చేసింది.

అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) మధ్యంతర బెయిల్ కండిషన్స్‌పై సీఐడీ (CID) దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును ఏపీ హైకోర్టు (AP High Court) రిజర్వ్ చేసింది. సీఐడీ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టులో విచారణకు రాగా... చంద్రబాబు తరపు న్యాయవాదాలు కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు. ఎల్లుండి అంటే నవంబర్ 3న ఆర్డర్స్ ఇస్తామని న్యాయమూర్తి తెలిపారు.


చంద్రబాబు తరపు వాదనలు:

‘‘కోర్టు ఆర్డర్ ఎక్కడా చంద్రబాబు అతిక్రమించ లేదు. చంద్రబాబు మాట్లాడటం అనేది ఆయన ప్రాథమిక హక్కులలో భాగమే తప్ప అతిక్రమణ కాదు. జైలు శిక్ష పడిన వారికి కూడా మీడియాతో మాట్లాడే అవకాశం గతంలో కోర్టుకు కల్పించాయి. సీఐడీ చెబుతున్న షరతులు ఆయన్ని హక్కులు హరించే విధంగా ఉన్నాయి. కేసు దర్యాప్తుపై ఎటువంటి ప్రభావం చూపుతుందో సీఐడీ అధికారులు చెప్పలేకోతున్నారు’’ అంటూ కోర్టుకు బాబు లాయర్లు తెలిపారు.

సీఐడీ వాదనలు:

జైలు నుంచి బయటకు వచ్చి చంద్రబాబు మీడియాతో మాట్లాడారంటూ ఆ వీడియో క్లిప్పింగ్స్ పెన్ డ్రైవ్‌లో కోర్టుకి సీఐడీ ఇచ్చింది. కోర్టు ఆర్డర్ ఉన్న తర్వాత కూడా చంద్రబాబు మీడియాతో మాట్లాడారని కోర్టుకు చెప్పింది. 13 గంటల పాటు జైలు నుంచి రాజమండ్రి నుంచి ర్యాలీగా చంద్రబాబు విజయవాడ వచ్చారన్నారు. ర్యాలీ లు నిర్వహించ వద్దని కోర్టు ఆదేశాలు ఉన్నాయని చెప్పిన చేశారని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఇరువురి వానదలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

Updated Date - 2023-11-01T16:14:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising