ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

KA Paul: జనసేనను 5వేల కోట్లకు బేరం పెట్టారు

ABN, First Publish Date - 2023-08-10T18:59:04+05:30

జనసేన(Janasena)ను బీజేపీ(BJP)లో విలీనం చేయాలని చిరంజీవి, పవన్‌కళ్యాన్(Chiranjeevi, Pawan Kalyan)మాట్లాడుకున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతి: జనసేన(Janasena)ను బీజేపీ(BJP)లో విలీనం చేయాలని చిరంజీవి, పవన్‌కళ్యాన్(Chiranjeevi, Pawan Kalyan)మాట్లాడుకున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం నాడు ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రజలతో మాట్లాడారు. ‘‘జనసేనను 5వేల కోట్ల రూపాయలకు విలీనం చేసేందుకు బేరం పెట్టారని.. దీని వెనక మాస్టర్ మైండ్ అల్లు అరవింద్‌ ఉన్నారు.మనకు అన్యాయం చేసిన మోదీకి పవన్ ఓటేయమంటున్నారు.అది వారాహి యాత్ర కాదు.. మోడీ కోసం చేసే యాత్ర.జనసేనకు ఒక్క ఓటేసినా మోదీకి ఓటేసినట్లే. నేనైతే పది లక్షల కోట్ల అప్పును ఒకే సారి తీర్చేస్తా’’ అని కేఏపాల్ అన్నారు.

అమరావతిని ఏడాదిలో కట్టి చూపిస్తా: కేఏపాల్

వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని ఎన్నుకోండి.. అమరావతిని ఏడాదిలో కట్టి చూపిస్తానని కేఏపాల్ వ్యాఖ్యానించారు. రెండు వారాల క్రితం రాయలసీమలో పర్యటించాం. ఈ పది రోజుల్లో 38 వేల మందిని కలిశా.ఆర్కే బీచ్లో లక్షన్నర మందిని కలిశా. మీ క్యాపిటల్ ఎక్కడా అని వైజాగ్‌లో ఓ విద్యార్ధి అడిగాడు.ఏపీకి క్యాపిటల్ కూడా లేని పరిస్థితిని సీఎం జగన్ తెచ్చారు.చంద్రబాబును గెలిపించమని నేను 18 సమావేశాలు పెట్టా.2014 నుంచి2019 వరకూ చంద్రబాబు ఏం చేశారు.ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రానికి అన్యాయం చేశారు.20 ఏళ్లకు చేయాల్సిన అప్పంతా ఈ నాలుగేళ్లలోనే జగన్ చేశారు. నరేంద్రమోదీ కోసం పని చేస్తున్న వైసీపీ, తెలుగుదేశం, జనసేనలను ఓడించాలి. వచ్చేనెలలో విజయవాడలో ప్రజాశాంతి రాష్ట్ర పార్టీ కార్యాలయం ప్రారంభిస్తున్నా’’ అని కేఏ పాల్ తెలిపారు.

Updated Date - 2023-08-10T18:59:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising