ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

SC Verdict On Viveka Case: సుప్రీం కోర్టు తీర్పుతో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు..

ABN, First Publish Date - 2023-04-24T16:58:52+05:30

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన ఉత్తర్వులు ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేకెత్తించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య (YS Viveka Murder Case)కు సంబంధించి సుప్రీంకోర్టు (Supreme Court) సోమవారం ఇచ్చిన ఉత్తర్వులు ఏపీ రాజకీయాల్లో (AP Politics) తీవ్ర ప్రకంపనలు రేపుతున్నాయి. అధికార, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు (YCP Leaders).. అలాగే తాడేపల్లి ప్యాలస్‌ (Tadepalli Palace) కూడా ఆత్మరక్షణలో పడింది. నిన్నటి వరకు ఈ కేసుకు సంబంధించి తమకు ఎటువంటి సంబంధలేదని చెప్పుకొచ్చిన వైసీపీ నేతలు సుప్రీం తీర్పుతో డిఫెన్స్‌లో పడ్డారు.

ఇప్పటి వరకు వైసీపీ నేతలు గానీ, తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు గానీ ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy)ని అరెస్టు చేయకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే సుప్రీం కోర్టు ఈ ప్రయత్నాలన్నింటికి బ్రేక్ వేసింది. చట్టం, న్యాయం ప్రకారం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు న్యాయసమ్మతం కాదని సుప్రీం ధర్మాసనం స్పష్టంగా చెప్పింది. భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కాకుండా సుదీర్ఘమైన తీర్పు ఇచ్చింది.

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొంత సంచలనం సృష్టించింది. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందన్నది చర్చనీయాంశమైంది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు పక్కనపెట్టడం సంచలమైన తీర్పుగా భావించవచ్చు. రాబోయే రోజుల్లో దీని ప్రభావం అన్ని అంశాలపై పడే అవకాశముంది. సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించిన ఎంపీ రఘురామకృష్ణంరాజు (Raghurama Krishnamraju) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ.. చట్టాలను అతిక్రమించిన ఆర్డర్స్ ఉండవని, న్యాయవ్యవస్థ వరకు నెం.1 కోర్టు క్లియర్ చేసిందన్నారు. మిగిలినవాళ్లు ట్రిక్కులు ప్లే చేసి.. అబద్దాలను నిజాలుగా చేసే ప్రచారం తగ్గుతుందన్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో పెనుమార్పులకు ఇదొక నాందిగా మారనుందని రఘురామ అభిప్రాయం వ్యక్తం చేశారు.

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు (Telangana High Court) ఇచ్చిన ముందస్తు బెయిల్‌పై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరిగింది. అవినాష్‌కు ముందస్తు బెయిల్‌ ఇవ్వడాన్ని ఛాలెంజ్ చేస్తూ వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి (Sunita Reddy) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ బెయిల్‌పై అటు అవినాష్.. ఇటు సునీత తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం కీలక తీర్పును ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు (TS High Court) ఇచ్చిన ఉత్తర్వులను తప్పుబడుతూ ముందస్తు బెయిల్‌ను సుప్రీం నిలిపివేసింది. అంతేకాదు విచారణను లిఖిత పూర్వకంగా ప్రశ్నలు ఇవ్వాలని సీబీఐని హైకోర్టు ఆదేశించడాన్ని కూడా న్యాయస్థానం తప్పుబట్టింది. దీంతో ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. సుప్రీం తాజా తీర్పుతో రేపటి వరకు అవినాష్‌ను అరెస్ట్ చేయకుండా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన రక్షణ తొలగిపోయినట్లుగా భావించవచ్చు.

Updated Date - 2023-04-24T17:01:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising