ఎస్పీ హర్షవర్ధన్‌రాజు బదిలీ
ABN , First Publish Date - 2023-04-08T23:30:58+05:30 IST
ఎస్పీ హర్షవర్ధన్‌రాజు బదిలీ అయ్యారు. శుక్రవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అఽధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.

నూతన ఎస్పీగా గంగాధర్‌రావు
రాయచోటి, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): ఎస్పీ హర్షవర్ధన్‌రాజు బదిలీ అయ్యారు. శుక్రవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఐపీఎస్ అఽధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ నేపధ్యంలో అన్నమయ్య జిల్లా ఎస్పీని సీఐడీ ఎస్పీగా బదిలీ చేశారు. ఈయన స్థానంలో అవినీతి నిరోధక శాఖలో ఎస్పీగా పనిచేస్తున్న గంగాధర్‌రావును నియమించారు. కొత్తగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాకు మొదటి ఎస్పీగా హర్షవర్ధన్‌రాజు బాధ్యతలు చేపట్టారు. తాను పనిచేసిన సంవత్సర కాలంలో ఎస్పీగా ఆయన మంచిపేరు తెచ్చుకున్నారు. స్పందన కార్యక్రమం ద్వారా బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారనే పేరుంది. అదే సమయంలో సిబ్బంది సంక్షేమం కోసం కూడా పని చేశారనే పేరుంది. అయితే అనూహ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎస్పీపై వేటు వేయడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.