Viveka Murder Case: ఉదయ్ బెయిల్ పిటిషన్ 15కు వాయిదా
ABN, First Publish Date - 2023-05-11T15:26:46+05:30
వైఎస్ వివేకా హత్య కేసులో (Viveka Murder Case) విచారణ వేగవంతమైన నేపథ్యంలో ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై గురువారం సీబీఐ కోర్టులో వాదనలు ముగిసాయి.
హైదరాబాద్: వైఎస్ వివేకా హత్య కేసులో (Viveka Murder Case) విచారణ వేగవంతమైన నేపథ్యంలో ఉదయ్ కుమార్ రెడ్డి (Uday Kumar Reddy) బెయిల్ పిటిషన్ (Bail Petition)పై గురువారం సీబీఐ కోర్టు (CBI Court)లో వాదనలు ముగిసాయి. ఈ నెల 15న ఉత్తర్వులు ఇస్తామని కోర్టు ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు డైరీని సీబీఐ కోర్టుకు సమర్పించింది. ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. బెయిల్ ఇస్తే ఉదయ్ కుమార్ సాక్షులను ప్రభావితం చేస్తారని.. ఉదయ్ ప్రమేయంపై తగిన ఆధారాలు సేకరించిన తర్వాతే అరెస్టు చేశామని సీబీఐ వాదించింది. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని కౌంటర్‌లో పునరుద్ఘాటించింది. వివేకా హత్య కుట్ర, సాక్ష్యాల ధ్వంసంలో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ పేర్కొంది.
వివేకా కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డి పాత్రకు సంబంధించి సుదీర్ఘ విచారణ, ఆధారాలు సేకరించిన తర్వాత పులివెందులలో అరెస్టు చేసి జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. ఇప్పుడు దర్యాప్తు దశలో ఉదయ్‌కు బెయిల్ మంజూరు చేసినట్లయితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని.. దీనిని దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేయవద్దని సీబీఐ వాదనలు వినిపించింది.
Updated Date - 2023-05-11T15:26:46+05:30 IST