Viveka Case : గొంతు పెంచి వాదిస్తే ప్రయోజనం ఉండదంటూ వివేకా పీఏ న్యాయవాదిపై జడ్జి ఫైర్
ABN, First Publish Date - 2023-07-03T13:32:23+05:30
వైఎస్ వివేకా హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలని ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ 5వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈ కేసును హైకోర్టు కే పంపుతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున ముందు అక్కడ తేల్చుకోవాలని సుప్రీం వెల్లడించింది.
ఢిల్లీ : వైఎస్ వివేకా హత్య కేసులో తనను బాధితునిగా గుర్తించాలని ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ 5వ తేదీకి వాయిదా పడింది. తొలుత ఈ కేసును హైకోర్టు కే పంపుతామని సుప్రీం ధర్మాసనం తెలిపింది. ఈ విషయంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగులో ఉన్నందున ముందు అక్కడ తేల్చుకోవాలని సుప్రీం వెల్లడించింది. ఈ కేసును ఏపీ నుంచి తెలంగాణ కు బదిలీ చేసే సమయంలో వివేకా సతీమణీ, కుమార్తెలను బాధితులుగా సుప్రీంకోర్టు గుర్తించింది. ఆ విషయాన్ని సునీతారెడ్డి తరపు న్యాయవాది సిద్దార్ధ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఈ కేసులో పిటీషనర్ ఎంవీ కృష్ణారెడ్డిని అనుమానితుడిగా పేర్కొంటూ సీబీఐ ఛార్జిషీటు దాఖలు చేసిన విషయాన్ని కూడా ధర్మాసనం దృష్టికి న్యాయవాది సిద్ధార్థ లూథ్రా తీసుకొచ్చారు. సీబీఐ ఛార్జిషీటు కాపీని సమర్పించడానికి బుధవారం వరకూ గడువు కోరారు. దీంతో కేసు తదుపరి విచారణను బుధవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. ఎంవీ కృష్ణారెడ్డి తరపు న్యాయవాది చౌదరిపై జస్టిస్ కృష్ణ మురారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గొంతు పెంచి వాదించినంత మాత్రాన ప్రయోజనం ఉండదని సూచించారు. కాగా.. వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని కూడా సవాలు చేస్తూ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటీషన్‌పై జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం విచారణ జరిపింది.
Updated Date - 2023-07-03T13:32:23+05:30 IST