ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amaravathi: వైఎస్ వివేకా హత్య కేసు.. సీఎం జగన్‌లో టెన్షన్..

ABN, First Publish Date - 2023-02-25T10:29:09+05:30

అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) వైసీపీని వెంటాడుతోంది. ఈ హత్య కేసులో తీగలాగితే డొంకంతా కదులుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు (YS Viveka Murder Case) వైసీపీని వెంటాడుతోంది. ఈ హత్య కేసులో తీగలాగితే డొంకంతా కదులుతోంది. కేసు విచారణ వేగవంతం కావడంతో సీఎం జగన్‌ (CM Jagan)లోనూ టెన్షన్ (Tension) పెరుగుతోంది. ఈ హత్య కేసు దర్యాప్తు అధికారపార్టీ నేతల్లో ఆందోళన రేపుతోందని శుక్రవారం జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి.

వైసీపీ పెద్దల నోట చాన్నాళ్ల తర్వాత మరోసారి ‘అదే మాట’ వినిపించింది! చంద్రబాబు (Chandrababu) వ్యవస్థలను మేనేజ్‌ (Manage) చేసేస్తున్నారట! అప్పుడు కాంగ్రెస్‌ (Congress) వాళ్లతో కలిసి వైఎస్‌ జగన్‌పై కేసులు పెట్టిన ఆయనే... ఇప్పుడు వైఎస్‌ వివేకా హత్య కేసు జగన్‌ మెడకు చుట్టుకునేలా చేస్తున్నారట! అందుకు సీబీఐ (CBI) కూడా సహకరిస్తోందట! వివేకా హత్య కేసులో సీబీఐ పట్టు బిగించిన ప్రతిసారీ... ఎంపీ అవినాశ్‌ రెడ్డి (MP Avinash Reddy)ని వెనకేసుకొస్తూ వైసీపీ (YCP) పెద్దలు మీడియా ముందుకు వస్తున్నారు. అలాగే... శుక్రవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి (Sajjala Ramakrishna Reddy) మీడియాతో మాట్లాడారు. బీజేపీలోని తన కోవర్టుల ద్వారా చంద్రబాబు సీబీఐని మేనేజ్‌ చేస్తున్నారని ఆయన అనడం అన్నింటికంటే హైలైట్‌!

ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచీ బీజేపీకి జగన్‌ సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. అటు బీజేపీ కూడా జగన్‌కు సహకరిస్తోంది. ఇదంతా పక్కనపెట్టి సీబీఐని చంద్రబాబు మేనేజ్‌ చేస్తున్నారని సజ్జల చెప్పడం గమనార్హం. వివేకా హత్య తర్వాత చంద్రబాబు మూడు నెలలు అధికారంలో ఉన్నారని, ఈ కేసును ఎందుకు ఛేదించలేదని ప్రశ్నించారు. ఈ మూడు నెలల్లో, అదీ ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును ఛేదించలేదని ఆక్షేపిస్తున్న సజ్జల రామకృష్ణా రెడ్డి... జగన్‌ అధికారంలోకి వచ్చాక ఆరు నెలలు ఏం చేశారు? ఇప్పుడు వీళ్లు చెబుతున్నదే నిజమైతే, ఆ కోణంలో దర్యాప్తు చేసి ఎందుకు కొలిక్కి తేలేకపోయారు?

ఈ కేసులో సీబీఐ విచారణను జగన్‌ వ్యతిరేకించలేదని సజ్జల చెప్పడం మరో విచిత్రం! సీబీఐ దర్యాప్తు కోరుతూ విపక్ష నేత హోదాలో వేసిన పిటిషన్‌ను... అధికారంలోకి రాగానే జగన్‌ ఉపసంహరించుకున్నారు. సీబీఐ విచారణ కోరుతూ వివేకా కుమార్తె సునీత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయగా... ‘అక్కర్లేదు’ అని జగన్‌ ప్రభుత్వం వాదించింది. ఇక... కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ఎక్కడా, ఎన్నడూ లేనివిధంగా దర్యాప్తు అధికారిపైనే పోలీసు కేసు పెట్టారు. మరి వీటన్నింటిని ఎలా అర్థం చేసుకోవాలి?

ఇక విపక్షాల కార్యకలాపాలపట్ల జగన్‌ ఉదారంగా వ్యవహరిస్తున్నారని సజ్జల చెప్పడం మరో పెద్ద జోక్‌! విపక్షంలో ఉండగా జగన్‌ స్వేచ్ఛగా ఓదార్పు యాత్ర, పాదయాత్ర చేశారు. ఇప్పుడు... జీవో వన్‌ పేరుతో రోడ్లపై ర్యాలీలు చేయొద్దని, సభలు పెట్టొద్దని ఆంక్షలు విధించారు. చంద్రబాబు పర్యటనలు అడ్డుకోవడంతోపాటు... లోకేశ్‌ పాదయాత్రలో మైక్‌ కూడా వాడకుండా అడ్డుకుంటున్నారు. స్టూల్‌ ఎక్కితే... అదీ లాగేస్తున్నారు. తాజాగా చంద్రబాబు అనపర్తి పర్యటనకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వాళ్లను వదిలేసి... బాధితులనే నిందితులుగా మార్చారు.

రాజకీయ ప్రత్యర్థులతో పాటు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న సామాన్యులపైనా సీఐడీని ప్రయోగిస్తున్నారు. ఇలా చేయాల్సిందంతా చేస్తూ ‘జగన్‌ ఉదారంగా ఉన్నారు’ అని సజ్జల పేర్కొనడం విశేషం. సజ్జల వ్యాఖ్యలకు టీడీపీ ధీటుగా కౌంటరిచ్చింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు సీబీఐని ప్రభావితం చేశారని, సజ్జల మతిలేని మాటలు మాట్లాడుతున్నారని వర్ల రామయ్య మండిపడ్డారు. చంద్రబాబుకు అంత శక్తి ఉంటే జగన్ రెడ్డి ఈ పాటికి జైలు ఊసలు లెక్కపెట్టి ఉండేవారని అన్నారు. వివేకా హత్యను చంద్రబాబే చేయించారని తన సలహాదారుతో జగన్ రెడ్డి ఇప్పటికీ చెప్పిస్తున్నారని, తాను సీఎం అయిన తర్వాత అది నిరూపించలేక ఏం గడ్డి పీకారని ప్రశ్నించారు.

మరోవైపు అధికారపార్టీ నేతల్లో వివేకా హత్య కేసు దర్యాప్తు మరింత ఆందోళన రేపుతోందనేది శుక్రవారం జరిగిన పరిణామాలు స్పష్టం చేశాయి. సజ్జల ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే అవినాష్ రెడ్డి విచారణ జరుగుతున్న సమయంలోనే కొడాలినాని ఎంట్రీ ఇచ్చారు. నాలుగేళ్ల నుంచి సీబీఐ గుడ్డి గుర్రానికి పళ్లు తోముతుందా? అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు వైసీపీని వెంటాడుతోందని అనడానికి ఇంతకంటే ఏంకావాలి...

Updated Date - 2023-02-25T10:29:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising