టీడీపీ చైతన్య రథయాత్రకు ఘన స్వాగతం

ABN , First Publish Date - 2023-07-17T23:14:15+05:30 IST

మండల పరిధిలోని టంగుటూరు గ్రామంలో టీడీపీ మండల నాయకుడు ధనిరెడ్డి విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో చైతన్య రథయాత్రలో భాగం గా ఆ పార్టీ నాయకులు మల్లెల లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి, జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సీఎం సురే్‌షనాయుడుకు ముందుగా పూలమాలలు వేసి డప్పువాయిద్యాలతో గ్రామశివార్ల నుంచి ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకువచ్చారు.

 టీడీపీ చైతన్య రథయాత్రకు ఘన స్వాగతం
మాట్లాడుతున్న టీడీపీ నాయకుడు సీఎం సురేష్‌నాయుడు,

రాజుపాలెం, జూలై 17 : మండల పరిధిలోని టంగుటూరు గ్రామంలో టీడీపీ మండల నాయకుడు ధనిరెడ్డి విశ్వనాథరెడ్డి ఆధ్వర్యంలో చైతన్య రథయాత్రలో భాగం గా ఆ పార్టీ నాయకులు మల్లెల లింగారెడ్డి, నంద్యాల వరదరాజులరెడ్డి, జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సీఎం సురే్‌షనాయుడుకు ముందుగా పూలమాలలు వేసి డప్పువాయిద్యాలతో గ్రామశివార్ల నుంచి ఊరేగింపుగా సభా ప్రాంగణానికి తీసుకువచ్చారు. టీడీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ఈ యాత్రను జయప్రదం చేశారు. టంగుటూరుకు చేరుకున్న చైతన్యరథయాత్ర టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. భవిష్యత్తులో టీడీపీకి పట్టం కట్టేందుకు కార్యకర ్తల ఉత్సాహం రెట్టింపు అయిందనడానికి ఈ కార్యక్రమం ఉదాహరణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మెట్టుపల్లి ప్రభాకర్‌రెడ్డి, ఎంపీటీసీ దస్తగిరి, మాజీ సర్పంచ్‌లు వెంగలాయపల్లె శ్రీనివాసులరెడ్డి, సర్పంచ్‌ కొరపాడు శ్రీనివాసులరెడ్డి, రామచంద్రారెడ్డి, వివిధ గ్రామాల టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ABN ఛానల్ ఫాలో అవ్వండి

Updated Date - 2023-07-17T23:14:52+05:30 IST