TDP Vs YCP: పులివెందులకు చంద్రబాబు వచ్చారని.. వైసీపీ వింత వైఖరి
ABN, First Publish Date - 2023-08-03T11:00:14+05:30
టీడీపీ అధినేత చంద్రబాబు పులివెందుల పర్యటన విజయవంతమైందని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అయితే చంద్రబాబు పులివెందుకు వచ్చి వెళ్లిన కారణంగా వైసీపీ శ్రేణులు మాత్రం వింతగా ప్రవర్తించారు. వారి వికృత ప్రవర్తనతో ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది.
కడప: టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu naidu) పులివెందుల పర్యటన విజయవంతమైందని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. అయితే చంద్రబాబు పులివెందుకు వచ్చి వెళ్లిన కారణంగా వైసీపీ శ్రేణులు మాత్రం వింతగా ప్రవర్తించారు. వారి వికృత ప్రవర్తనతో ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది. పులివెందులలో చంద్రబాబు పర్యటించారంటూ వైసీపీ శ్రేణులు పులివెందుల పూలంగళ్ల సర్కిల్లో రోడ్లపై పసుపు నీళ్లతో శుద్ధి చేశారు. ట్యాంకర్లను తీసుకువచ్చి అందులో ఉన్న పసుపు నీళ్లతో రోడ్లను క్లీన్ చేశారు. నిన్న చంద్రబాబు రోడ్ షో, బహిరంగ సభల్లో పులివెందుల పూలంగళ్ల సర్కిల్ రోడ్లపై తిరగడాన్ని నిరసిస్తూ పసుపు నీళ్లతో శుద్ధి చేశామని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు. మరోవైపపు వైసీపీ నేతల తీరుపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పులివెందులలో చంద్రబాబు పర్యటన విజయవంతమైందని.. ఓర్వలేక.. దిక్కుతోచని స్ధితిలో వైసీపీ నేతలు ఏదేదో చేస్తున్నారని టీడీపీ నేతలు యెద్దేవా చేశారు. పసుపు శుభ సూచికం కాబట్టి టీడీపీకి శుభం కలగాలని పసుపు నీళ్లతో శుద్దిచేస్తున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు.
కాగా.. నిన్న పులివెందులలో పర్యటించిన చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైనాట్ పులివెందుల అంటూ ప్రశ్నించారు. పులివెందులలో టీడీపీని గెలిపించాలని.. ఇక్కడి ప్రజలకు ఏంకావాలన్న చూసే పూచీ తనది అంటూ హామీ ఇచ్చారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాత్రి జమ్మలమడుగు చేరుకున్న ఆయన బుధవారం కొండాపురం మండలంలోని గండికోట ఎత్తిపోతల విస్తరణ పథకం ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం తిమ్మాపురం క్రాస్ వద్ద రైతులతో భేటీ అయ్యారు. రాత్రి 8గంటల ప్రాంతంలో పులివెందుల చేరుకుని పూలంగళ్ల వరకు రోడ్ షో నిర్వహించారు. ఇక్కడికి కూతవేటు దూరంలోని వెంకటేశ్వరస్వామి గుడి ఎదురుగా బహిరంగ సభలో మాట్లాడారు. వైసీపీ వారు ఏదేదో అంటున్నారు.. ఇప్పుడు అంటున్నా.. వైనాట్ పులివెందుల’’ అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
Updated Date - 2023-08-03T11:00:14+05:30 IST