ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanna Lakshminarayana: టీడీపీలోకి కన్నా..! మూహుర్తం ఫిక్స్..?

ABN, First Publish Date - 2023-02-19T21:24:16+05:30

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) టీడీపీలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న తన అనుయాయులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. అనుయాయుల నుంచి రాజకీయ భవిష్యత్‌పై ఏకాభిప్రాయం వ్యక్తం కావటంతో టీడీపీ (TDP)లో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 23న టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో కన్నా టీడీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. గుంటూరు కన్నావారితోటలోని తన నివాసంలో నగరంలోని తూర్పు, పశ్చిమతో పాటు ఉమ్మడి గుంటూరులోని పెదకూరపాడు, సత్తెనపల్లి, పల్నాడులో ఉన్న తన అనుయాయులతో సుమారు నాలుగు గంటలకు పైగా సమాలోచనలు జరిపారు. చంద్రబాబు నాయకత్వంలోనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అనుయాయులు ఏకాభిప్రాయం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.

అమరావతి (Amaravati) రాజధాని నిర్మాణం కావాలన్నా చంద్రబాబు సారధ్యంలోనే సాధ్యమవుతుందని అభిప్రాయానికి నేతలు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోవటంతో పాటు అభివృద్ధి సాధించాలన్నా చంద్రబాబు నాయకత్వం అవసరమని అందరూ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. అనుచరుల సూచనలతో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారట. ఈ నెల 23న మధ్యాహ్నం నుంచి గుంటూరు కన్నావారితోటలోని తన నివాసం నుంచి అనుయాయులతో పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లనున్నారు. కన్నాతో పాటు పలువురు నాయకులు కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని ఉమ్మడి జిల్లాలో గుసగుసలు వినిపిస్తాయి.

బీజేపీకి కన్నా గుడ్‌బై

బీజేపీ (BJP) ప్రాథమిక, ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను జాతీయ కార్యాలయానికి మెయిల్‌ ద్వారా పంపారు. ఆయనతో పాటు వివిధ విభాగాలకు చెందిన కొందరు రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేశారు. అంతకుముందు గుంటూరులోని తన నివాసంలో అనుచరులు, కార్యకర్తలతో కన్నా సమావేశమయ్యారు. వారితో చర్చల అనంతరం పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆయనతో పాటు అండమాన్‌ నికోబార్‌ దీవుల ఇన్‌చార్జి తాళ్ల వెంకటేశ్‌ యాదవ్‌ మరికొంత మంది సీనియర్‌ నాయకులు రాజీనామా చేశారు. అనంతరం కార్యకర్తలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. 2014లో బీజేపీలో చేరానని.. సామాన్య కార్యకర్త నుంచి పార్టీ పటిష్ఠానికి కృషి చేశానని చెప్పారు.

Updated Date - 2023-02-19T21:24:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising