Kanna: జగన్‌పై కన్నా సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ అధ్యక్ష పదవి నుంచి..
ABN, First Publish Date - 2023-06-25T21:59:46+05:30
ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) అరాచకాలను ప్రశ్నించినందుకే తనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దించే కుట్ర చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు: ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి (AP CM Jaganmohan Reddy) అరాచకాలను ప్రశ్నించినందుకే తనను బీజేపీ అధ్యక్ష పదవి నుంచి దించే కుట్ర చేశారని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఎన్నికల్లో నిధుల దుర్వినియోగంపై ఐదుగురితో కమిటీ వేశానని, నిధుల దుర్వినియోగంలో తన పాత్రలేదని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
మంత్రి అంబటి చిల్లర మాటలు మానుకోవాలని, వైసీపీ రాక్షస పాలన అంతంచేయాలనే టీడీపీలో చేరానని కన్నా వెల్లడించారు. వార్త వచ్చిన తర్వాత తాను పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యానని, కేంద్ర మంత్రి మురళిధరన్ సూచన మేరకు ఫిర్యాదు చేయకుండా ఆగినట్లు చెప్పారు. ముద్రగడ ఎప్పుడూ ఏ పని చేసినా తన వ్యక్తిగత ప్రాబల్యం కోసమే చేశారని, ముద్రగడ మంత్రిగా ఉన్నప్పుడు కులం గురించి మాట్లాడ వద్దని తనతో చెప్పాడని కన్నా పేర్కొన్నారు.
తన రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతుందని భావించినప్పుడల్లా ఇలా ముందుకు వస్తారని, కాపులకు మేలు చేసిన చంద్రబాబుకు ముద్రగడ ఎప్పుడైనా కృతజ్ఞతలు చెప్పారా అని కన్నా ప్రశ్నించారు. కాపులను బీసీల్లో చేర్చే ప్రక్రియ చేపట్టింది చంద్రబాబు అని, కాపు రిజర్వేషన్ల అంశంలో ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని విమర్శించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో 5 శాతం చంద్రబాబు కాపులకు ఇచ్చారని, కానీ జగన్ మాత్రం గోదావరి జిల్లాల్లో పాదయాత్ర చేస్తూ కాపు రిజర్వేషన్లు వ్యతిరేకించారని మండిపడ్డారు. జగన్ సీఎం అయ్యాక కాపు రిజర్వేషన్లపై లేఖ రాస్తే స్పందన లేదని, వైకాపా మంత్రులు కూడా ఈ విషయంపై మాట్లాడకుండా దాట వేశారని కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-06-25T22:03:54+05:30 IST