ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kanna Lakshminarayana: సీఎం జగన్‌పై కన్నా లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు

ABN, First Publish Date - 2023-03-29T17:57:39+05:30

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (TDP leader Kanna Lakshminarayana) సంచలన ఆరోపణలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై (YS Jaganmohan Reddy) టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (TDP leader Kanna Lakshminarayana) సంచలన ఆరోపణలు చేశారు. ఏపీలో జగన్ రాక్షస క్రీడ ఆడుతున్నారని, ఏపీని జగన్ సర్కార్‌ దోచుకుంటోందని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. జగన్‌రెడ్డి సర్కార్‌కు రోజులు దగ్గరపడ్డాయని, దీనికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాలే నిదర్శనమన్నారు. సంక్షేమమంటే మొదట గుర్తొచ్చేది ఎన్టీఆర్ (NTR) పరిపాలనే అని, ఎన్టీఆర్ ఆశయాలను చంద్రబాబు (Chandrababu) ముందుకు తీసుకెళ్తున్నారని కన్నా గుర్తు చేశారు.

175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం చంద్రబాబు (Chandrababu), ఆయన దత్తపుత్రుడికి ఉందా అంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి (CM Jaganmohan Reddy) చేసిన సవాల్‌పై టీడీపీ నేత కన్నా లక్ష్మీనారాయణ (TDP Leader Kanna Laxminarayana) స్పందించారు. పోలీసులతో పాలన చేయడమా జగన్ రెడ్డి దమ్ము.. ప్రతిపక్షాల నోరు నొక్కడమేనా జగన్ దమ్ము అంటూ ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టడమా జగన్ రెడ్డి ధైర్యమని అడిగారు.

టీడీపీ (TDP) ఏదైనా కార్యక్రమం చేస్తే రాత్రికి వాళ్ల ఆస్తులు తగలబెట్టడమా ధైర్యం అంటూ మండిపడ్డారు. జగన్ రెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే ఎన్నికలలో డబ్బు, మద్యం పంచకుండా రావాలని సవాల్ విసిరారు. ‘‘నీ నవరత్నాలపై నీకు నమ్మకం ఉంటే సక్రమ పద్దతిలో ఎన్నికలకు రా. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చేసిన వ్యాఖ్యలు గుర్తు చేసుకో. కులం, మతం చూడకుండా పాలన చేశానని ప్రజలను ఓట్లు అడిగే దమ్ము ఉందా. ప్రజా సమస్యలు పక్కదారి పట్టించేందుకే విమర్శలు, సవాళ్లు’’ అంటూ కన్నా లక్ష్మీనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-29T17:59:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising