Kotam Reddy SridharReddy: కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం.. చిల్లర అంశమని కొట్టిపారేసిన సజ్జల
ABN, First Publish Date - 2023-02-02T16:21:18+05:30
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy SridharReddy) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో పెద్ద దుమారం రేపుతోంది.
అమరావతి: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy SridharReddy) ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏపీలో పెద్ద దుమారం రేపుతోంది. సొంత ప్రభుత్వమే తన ఫోన్‌ను ట్యాపింగ్ చేస్తోందన్న కోటంరెడ్డి వాపోయారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆధారాలను బహిర్గతం చేశారు. తన సంభాషణలను దొంగచాటుగా వింటున్నారని.. రాష్ట్ర నిఘా చీఫ్ సీతారామాంజనేయులు స్వయంగా తనకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించారు. అయితే కోటంరెడ్డి ఆరోపణలకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) తోచిపుచ్చారు. అసలు కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) జరగలేదని వివరణ ఇచ్చారు. ఫోన్ మాట్లాడేటప్పుడు కాల్ రికార్డింగ్ చేశారని, ఫోన్ ట్యాపింగ్ జరగనప్పుడు విచారణ ఎందుకు? అని ప్రశ్నించారు. విమర్శలు చేస్తోన్న ఎమ్మెల్యేలను ప్రజలే అనర్హులను చేస్తారని తెలిపారు. ఇలాంటి చిల్లర అంశాలు పట్టించుకునే టైం తమకు లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కుట్రలేనని ఆరోపించారు. దీనిలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలాంటి వాళ్లు పాత్రధారులని, లేని విషయాలను ఉన్నట్లు సృష్టించేందుకే టీడీపీ యత్నిస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి దుయ్యబట్టారు.
నా ఫోను ట్యాపింగ్‌కు.. ఇవిగో ఆధారాలు
‘మీ ఫోనునో, సజ్జల ఫోనో, విజయసాయిరెడ్డి ఫోనో.. లేక రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రినని భావిస్తున్న ధనుంజయరెడ్డి (Dhanunjaya Reddy) (సీఎంవో అధికారి) ఫోనునో కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ చేసి దొంగచాటుగా సంభాషణలు వింటోందన్న ఆధారాలు మీ చేతికొస్తే మీ స్పందన ఎలా ఉంటుంది? మనసు కలత చెందదా’ అని సీఎం జగన్‌ను కోమటిరెడ్డి ప్రశ్నించారు. సుమారు 35 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, నలుగురు ఎంపీలు తనకు ఫోన్ చేసి తమ ఫోన్లు కూడా ట్యాపింగ్ చేస్తున్నారంటూ బాధపడ్డారని వెల్లడించారు. ఈ ట్యాపింగ్ ఎమ్మెల్యేలతో ఆగదని ఆగదని.. మంత్రులు, హైకోర్టు (High Court) ప్రధాన న్యాయమూర్తులు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఎంపీలు, మీడియా యాజమాన్యాలు, విలేకరుల ఫోన్లనూ ట్యాపింగ్ చేస్తారని.. ఇది న్యాయమా.. ధర్మమా అని నిలదీశారు. తన ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్ర హోం శాఖకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించారు.
Updated Date - 2023-02-02T16:25:37+05:30 IST