ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kotam Reddy: ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై ఒక్క మాటతో తేల్చేసిన కోటంరెడ్డి

ABN, First Publish Date - 2023-02-10T21:06:03+05:30

తన రాజీనామాను కోరే ముందు టీడీపీ (TDP) లో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, ఆ తరువాత తన గురించి మాట్లాడాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: తన రాజీనామాను కోరే ముందు టీడీపీ (TDP) లో గెలిచి వైసీపీలోకి వచ్చిన ఆ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, ఆ తరువాత తన గురించి మాట్లాడాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) స్పష్టం చేశారు. శుక్రవారం నెల్లూరులోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి అనిల్‌ (Former Minister Anil)తోపాటు ఇతర మంత్రులు, కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలు (YCP MLAs) తన రాజీనామా కోసం డిమాండ్‌ చేస్తున్నారని తెలిపారు. ముందుగా ఆ... ఎమ్మెల్యేల చేత స్పీకర్‌ ఫార్మెట్‌లో రాజీనామా చేయించి ఆమోదింప చేసి, ఆ తరువాత తన రాజీనామాను కోరాలని స్పష్టంచేశారు. తనకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, మద్దతుదారులను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసన్నారు. రానున్న రోజుల్లో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం (Nellore Rural Constituency)లో చిత్ర విచిత్రాలు, ఎత్తుకుపైఎత్తులు, వ్యూహప్రతివ్యూహాలు ఎన్నో ఉంటాయని శ్రీధర్‌‌రెడ్డి ప్రకటించారు. త్వరలో నెల్లూరు (Nellore) గ్రామదేవత ఇరగాళమ్మ జాతర జరగనున్నదని, అందులోనూ ప్రభుత్వం రాజకీయాలు చేస్తే తదుపరి నిర్ణయం ఏమిటో చెబుతానని హెచ్చరించారు. తానెప్పుడూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్రాప్‌లో పడలేదని, ప్రజల ట్యాప్‌లో ఉంటానని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.

ఆదాల ప్రకటనలో స్పష్టత లేదు

నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి (Adala Prabhakara Reddy), నెల్లూరు రూరల్‌ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ప్రకటిస్తున్న దాంట్లో స్పష్టత లేదని తెలిపారు. మూడు వీడియోలు బయటకు వస్తే అందులో మూడు రకాలుగా ఉందని చెప్పారు. ఇందులో ఏదీ నిజమో ఆదాల స్పష్టం చేయాలన్నారు. ముందుగా తనకు మద్దతు తెలుపుతూ వచ్చిన నెల్లూరు ఏఎంసీ చైర్మన్‌ కూకటి హరియాదవ్‌, గుండ్లపాళెం సొసైటీ అధ్యక్షుడు మురళీరెడ్డిలతోపాటు సర్పంచులు, ఎంపీటీసీలు, కోఆప్షన్‌ సభ్యులు, వివిధ కార్పొరేషన్‌ డైరెక్టర్లను ఆయన మీడియా సమావేశంలో పరిచయం చేయడం గమనార్హం.

Updated Date - 2023-02-10T21:06:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising