భావితరాల భవిష్యత్తు కోసమేఅమరావతి పోరాటం
ABN , Publish Date - Dec 18 , 2023 | 01:04 AM
వైసీపీ ప్రభుత్వ వికృత చేష్టల వల్ల రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితినిఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించడం అత్యంత బాధాకరమని, భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్న అమరావతి ఉద్యమం చరిత్రలో నిలచిపోతుందని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత ఆళ్ల గోపాలకృష్ణ అన్నారు. రంగన్నగూడెంలో ఆదివారం స్థానిక రైతులతో కలిసి అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా, రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

హనుమాన్‌జంక్షన్‌రూరల్, డిసెంబరు 17 : వైసీపీ ప్రభుత్వ వికృత చేష్టల వల్ల రాజధాని ఏదో చెప్పుకోలేని స్థితినిఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుభవించడం అత్యంత బాధాకరమని, భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్న అమరావతి ఉద్యమం చరిత్రలో నిలచిపోతుందని అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేత ఆళ్ల గోపాలకృష్ణ అన్నారు. రంగన్నగూడెంలో ఆదివారం స్థానిక రైతులతో కలిసి అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా, రైతులు చేస్తున్న ఉద్యమానికి సంఘీభావం తెలుపుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ మూడు రాజధానుల వికృత క్రీడకు వ్యతిరేకంగా అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని రైతులు, మహిళలు, దళితులు నాలుగేళ్ల పోరాటం భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. రాజకీయ ప్రయోజనే ముఖ్యమంటూ అమరావతికి మరణశాసనం రచించిన వైసీపీకి త్వరలోనే ప్రజలు తగినబుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబునాయుడు ముందు చూపుతో ప్రణాళిక ప్రకారం ఏర్పాటు చేసిన స్వయం ప్రధారిత(ఆదాయాన్ని సమకూర్చే) ప్రాజెక్ట్ అమరావతి అని, దీనివల్ల రాష్ట్రానికి ఆదాయంతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు లభించేవన్నారు. ఇప్పటికైనా అమరావతి రైతులచారిత్రాత్మక ఉద్యమాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం వికృత క్రీడకు తెరదించి అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ పుసులూరి లక్ష్మీనారాయణ, మొవ్వా శ్రీనివాసరావు, కసుకుర్తి అర్జునరావు, మందపాటి రాంబాబు, కనకవల్లి యాకోబు, కొలుసు గంగాజలం, కోట మురళీకృష్ణ, నెరుసు తాతయ్య, రైతులు పాల్గొన్నారు.