Fire Accident: అంబులెన్సులో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. చివరికి ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Mar 09 , 2025 | 03:58 PM
విజయవాడలో రోడ్డుపై వెళ్తున్న అంబులెన్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇతర వాహనదారులు అప్రమత్తం చేయడంతో రహదారిపైనే అంబులెన్స్ ఆపేసి డ్రైవర్ దిగిపోయాడు.

విజయవాడ: నగరంలో ఘోర అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. కదులుతున్న అంబులెన్సులో మంటలు చెలరేగి (Fire broke out in ambulance) భారీ ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు ఆస్పత్రికి రోగి బంధువులు ఫోన్ చేశారు. కుటుంబసభ్యుడి ఆరోగ్యం బాగోలేదని వెంటనే రావాలని కోరారు. ఆస్పత్రి యాజమాన్యం సూచనల మేరకు 108 అంబులెన్స్ డ్రైవర్.. రోగి ఇంటికి బయలుదేరాడు. అయితే రోడ్డుపై అంబులెన్స్ వెళ్తున్న సమయంలో వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ఇతర వాహనదారులు అప్రమత్తం చేయడంతో రహదారిపైనే అంబులెన్స్ ఆపేసి డ్రైవర్ దిగిపోయాడు. భారీగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక యంత్రానికి స్థానికులు సమాచారం అందించారు. అయితే వారు వచ్చే లోపే వాహనం పూర్తిగా దగ్ధమైంది. మరోవైపు మంటలు భారీగా వ్యాపించడంతో ప్రక్కనే ఉన్న సిటీ బస్టాప్ సైతం తగలబడింది. ప్రమాద సమయంలో వాహనంలో ఎవ్వరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాద ఘటనలో ప్రాణనష్టం జరగనప్పటికీ భారీగానే ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Nara Lokesh: దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదొక అరుదైన ఘట్టం
Minister Anagani : క్షేత్రస్థాయిలో విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి