ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

BJP Purandeswari: సీఎం జగన్‌పై పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు..

ABN, First Publish Date - 2023-09-18T12:55:58+05:30

ఎన్నికల్లో ఓట్ల కోసం మద్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి జగన్ (CM JAGAN) చాలా గొప్పగా చెప్పారు. నేడు మద్యం ద్వారా వేల కోట్ల అవినీతి జరుగుతుందనేది నిజం. గతంలో రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్‌లను పూర్తిగా మార్చేశారు. కొత్త బ్రాండ్‌లను

విజయవాడ: చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest) తీరును ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandeswari) ప్రశ్నించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘అవినీతి ఎవరు చేసినా శిక్షించాలనే చెబుతున్నాం. అవినీతి జరిగిందని చెప్పడానికి మేము ఎవ్వరం, అది రేపు కోర్టులో న్యాయమూర్తి నిర్ణయిస్తారు. సీఐడీ విచారణ పూర్తిస్థాయిలో చేసిందా లేదా అనే అనుమానం మాకుంది. మీరు రిమాండ్‌కు పంపారు... వాదోపవాదాలు అయ్యాక వాస్తవాలు బయటకు వస్తాయి.’’ అని పేర్కొన్నారు.

జగన్ మద్యం దోపిడీపై పురంధేశ్వరి పైర్

‘‘ఎన్నికల్లో ఓట్ల కోసం మద్యం గురించి, ప్రజల ఆరోగ్యం గురించి జగన్ (CM JAGAN) చాలా గొప్పగా చెప్పారు. నేడు మద్యం ద్వారా వేల కోట్ల అవినీతి జరుగుతుందనేది నిజం. గతంలో రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్‌లను పూర్తిగా మార్చేశారు. కొత్త బ్రాండ్‌లను మార్కెట్లోకి తెచ్చి.. వాటి ద్వారా దోచుకుంటున్నారు. గతంలో ఉన్న యాజమాన్యాల నుంచి కంపెనీలు లాక్కుని.. పేర్లు మార్చి అధికార పార్టీలో ఉన్న ముఖ్య నేతలు వీటిని నడుపుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీనే కంపెనీ ఇవ్వనంటే.. ఆయన తయారు చేసిన మద్యాన్ని కొనకుండా పక్కన పెట్టేశారు. ఏపీలో ఆరోగ్యానికి పూర్తి హాని కరమైన పదార్ధాలతో మద్యం తయారీ జరుగుతుంది.

15 రూపాయలకు తయారు చేసే ఒక మద్యం సీసాను ఆరేడు వందలకు అమ్ముతున్నారు. మహిళల పుస్తెలు తెగిపోయినా పర్వాలేదు.. బిడ్డల భవిష్యత్ నాశనం అయినా పర్వాలేదు.. కుటుంబాలు చిద్రమైన పర్వాలేదు. జగన్‌కు డబ్బులే కావాలి... అదేమంటే.. ఈ పథకాల పేరు చెబుతారు. తన ఓటు బ్యాంకును పదిల పరచుకోవడానికి జగన్ శవాల మీద పేలాలు వేరుకునే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ చీఫ్ లిక్కర్ తాగడం వల్లే ఎంతోమంది అనారోగ్యానికి గురై చనిపోయారు. ఈ మరణాలపై కచ్చింగా సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లి జగన్ చేసే మోసాలను వివరిస్తాం. చీప్ లిక్కర్ తాగించి వారి ప్రాణాలతో ఆడుకుంటూ కోట్లు దోచుకుంటున్న వైనాన్ని చెబుతాం. మద్యం తయారీకి సంబంధించి గుత్తాధిపత్యం మొత్తం ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుకుంది. మద్యం కంపెనీలు తయారు చేసిన సరఫరా వివరాలు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరుతాయి.

ఆ కంపెనీలు వారు పంపే సరుకును బట్టి.. ప్యాలెస్‌లో కప్పం కట్టాలి. రోజుకు ఎనభై లక్షల మంది మన దగ్గర మద్యం తాగుతున్నారని అంచనా. అంటే ఒక రోజుకు రూ.160 కోట్లు ఆదాయం. నెలకు 4,800కోట్లు ఆదాయం. ఏడాదికి వచ్చే సరికి రూ.56,700 కోట్లు. కానీ బడ్జెట్‌లో రూ. 20 వేల కోట్లు ఆదాయం మద్యం ద్వారా వస్తున్నాయని చూపుతున్నారు. మరి రూ.36,700 కోట్లు ఎక్కడకు వెళుతున్నాయి. ఎవరి దగ్గర ఉన్నాయి. ఈ మద్యం ఆదాయంపై ప్రభుత్వం వైట్ పేపర్ విడుదల చేయాలి. ఇంతకంటే పెద్ద కుంభకోణం ఏమైనా ఉంటుందా?, మహిళలు కూడా ఆలోచన చేయాలి.. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న వారికి బుద్ది చెప్పాలి.’’ అని పిలుపునిచ్చారు.

Updated Date - 2023-09-18T13:29:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising