ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Minister: మంత్రిని కాదని సీఎంకు ఎలా ఫిర్యాదు చేస్తారు?.. దుర్గగుడి వివాదంపై కొట్టు సత్యనారాయణ

ABN, First Publish Date - 2023-05-07T12:36:37+05:30

దుర్గగుడి ఈవో, ట్రస్టు బోర్డు చైర్మన్ మధ్య వివాదంపై దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: దుర్గగుడి ఈవో, ట్రస్టు బోర్డు చైర్మన్ మధ్య వివాదంపై దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ (AP Minister Kottu Satyanarayan) స్పందించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏసీబీ అధికారుల దాడులపై ఈవోపై (Durgamma Temple EO) విమర్శలు చేయడం తగదన్నారు. కొంతమంది తమ ఇష్ట ప్రకారం పనులు కావడం లేదని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రిని కాదని సీఎం జగన్‌కు ఈవోపై ఫిర్యాదు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. వివాదంపై విచారణ చేయాలని సీఎం ఆఫీస్ మళ్లీ తనకే పంపిస్తుందన్నారు. పాలకమండలి నియామకం జరిగి ఎంతో కాలం కాలేదని.. గుడిపై మొత్తం తమదే పెత్తనం అనే భావనలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే ఆలోచించాల్సి వస్తుందన్నారు. అంతిమంగా ప్రభుత్వం చేసే నిర్ణయాలకు ఎవరైనా కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు. అవినీతి అధికారుల విషయంలో ఉపేక్షించేది లేదని మంత్రి కొట్టుసత్యనారాయణ తేల్చిచెప్పారు.

Updated Date - 2023-05-07T12:36:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising