ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagan: రైతుల విషయంలో సీఎం జగన్ నిర్ణయాలు ఇవే

ABN, First Publish Date - 2023-03-29T20:10:01+05:30

వ్యవసాయ శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ (CM Jagan) సమీక్ష నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: వ్యవసాయ శాఖపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ (CM Jagan) సమీక్ష నిర్వహించారు. రబీ ధాన్యం సేకరణ ఏప్రిల్‌15 నుంచి రబీ సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణ చేయడానికి అన్నిరకాలుగా చర్యలు తీసుకోవాలన్న సీఎం ఆదేశించారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై ఎన్యూమరేషన్‌‌పై అధికారులను జగన్ అడిగితెలుసుకున్నారు. ఏప్రిల్‌ మొదటి వారంలో నివేదిక ఖరారుచేస్తామని, ఏప్రిల్‌ రెండో వారానికి నష్టపోయిన రైతుల జాబితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికే 100శాతం ఇ క్రాపింగ్‌ పూర్తైందని సీఎంకు అధికారులు వెల్లడించారు. ఆర్బీకేల ద్వారా రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఈ ఏడాది ఆర్బీకేల ద్వారా 2023–24లో 10.5లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

అలాగే పొలంబడి శిక్షణ‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. శిక్షణ కార్యక్రమాల వల్ల వరి, వేరుశెనగలో 15శాతం, పత్తిలో 12 శాతం, మొక్కజొన్నలో 5శాతం పెట్టుబడి ఖర్చులు తగ్గాయని సీఎంతో అధికారులు చెప్పారు. పత్తిలో 16శాతం, మొక్కజొన్నలో 15 శాతం, వేరుశెనగ 12 శాతం, వరిలో 9శాతం దిగుబడులు పెరిగాయని అధికారులు పేర్కొన్నారు. అలాగే రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ షెడ్యూల్‌కు సీఎం ఎట్టకేలకు ఆమోదం తెలిపారు.

మిల్లెట్స్ కోసం 19 జిల్లాల్లో 100 హెక్టార్ల చొప్పున మిల్లెట్‌ క్లస్టర్లను ఏర్పాటు చేయాలని అధికారులు పేర్కొన్నారు. 3 ఆర్గానిక్‌ క్లస్టర్లను కూడా ఏర్పాటు చేసినట్టు వారు వెల్లడించారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్‌ తరహాలోనే ప్లాంట్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. భూ పరీక్షకోసం నమూనాల సేకరణ, వాటిపై పరీక్షలు, వాటి ఫలితాలను రైతులకు అందించడం, ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఈ పరీక్షలు చేసేదిశగా చర్యలు తీసుకోవాలని జగన్ ఆదేశించారు.

Updated Date - 2023-03-29T20:10:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising