AP News: సీఎం జగన్‌పై దేవినేని ఉమ తీవ్ర ఆగ్రహం
ABN, First Publish Date - 2023-04-02T20:31:48+05:30
నిరుద్యోగ యువత అయోమయ పరిస్థితిలో ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma Maheswara Rao) మండిపడ్డారు.
విజయవాడ: నిరుద్యోగ యువత అయోమయ పరిస్థితిలో ఉన్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ (Devineni Uma Maheswara Rao) మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రెండు లక్షల 33 వేల మందికి ఉద్యోగాలు ఇస్తానని పాదయాత్రలో చెప్పిన మాటలు ఎండమావులుగా కనబడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్సీ ఊసే లేదు.. ఒక్క టీచరు పోస్టు భర్తీ చేయలేదన్నారు. జగన్ రెడ్డి కమీషన్ల కక్కుర్తితో మూడున్న రేళ్లలో 17 లక్షల కోట్ల పెట్టుబడులు పొరుగు రాష్ట్రాలకు తరిమేసి 34 లక్షల మంది యువత ఉపాధికి గండి కొట్టారని ఆరోపించారు. టీడీపీ (TDP) హయాంలో ఐటి అభివృద్ధితో 34 వేల ఉద్యోగాలు, స్కిల్ డెవలప్ మెంట్ ద్వారా 64,000 ఉద్యోగాలిచ్చామని ఆయన గుర్తుచేశారు. జగన్‌రెడ్డి ఐటి కంపెనీలు తరిమేసి, అక్రమ కేసులతో స్కిల్ డెవలప్ మెంట్‌ని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రతినెల 6 లక్షల మంది నిరుద్యోగ యువతకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి (ముఖ్యమంత్రి యువనేస్తం) ఇస్తే జగన్ రెడ్డి దాన్ని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-04-02T20:31:48+05:30 IST